బాక్సాఫీస్ : “అవతార్ 2” 20 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు ఎంతకొచ్చాయ్.?

ప్రస్తుతం ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర మళ్ళీ కూడా సెన్సేషన్ ని రేపుతున్న చిత్రం “అవతార్ ది వే ఆఫ్ వాటర్”. దర్శకుడు జేమ్స్ కామెరాన్ తెరకెక్కించిన గత సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పదేళ్లకు ఒకసారి వచ్చినా మళ్ళీ తన సినిమాతో తన రికార్డులు బద్దలు కొట్టే రేంజ్ రికార్డులు సెట్ చేసుకుంటున్నారు.

ఇక అలా గత 2009 లో వచ్చిన సినిమా “అవతార్” పెట్టిన రికార్డులు ఇంకా పదిలంగానే ఉన్నాయి. కానీ దీనిని ఇపుడు అవతార్ 2 క్రాస్ చేసే దిశగా వెళ్తుంది. అయితే అవతార్ 2 ఇప్పుడు వరల్డ్ వైడ్ 14 నుంచే రిలీజ్ కాగా దీనితో ఈ చిత్రం ఇప్పటికి 20 రోజుల రన్ ని కంప్లీట్ చేసుకుంది.

మరి ఏఈ చిత్రం ఈ 20 రోజుల్లో ఎంత వసూలు చేసిందో తెలుస్తుంది. ఇక ఇప్పటివరకు అయితే నార్త్ అమెరికా సహా ఇండియా మరియు చైనా లో వసూళ్లు 1.4 బిలియన్ డాలర్స్ వసూళ్లు అందుకుందట. దీనితో అవతార్ 2 సెన్సేషనల్ వసూళ్లు రాబట్టింది అని చెప్పాలి.

ఇక ఇండియాలో వసూళ్లు విషయానికి వస్తే ఈ సినిమా 18 రోజుల్లో 333 నుంచి 340 కోట్లు గ్రాస్ అందుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ 18 రోజులు ఎందుకంటే పలు దేశాల్లో అవతార్ 2 డిసెంబర్ 14నే రిలీజ్ కాగా ఇండియాలో మాత్రం ఈ చిత్రం డిసెంబర్ 16న అయ్యింది.

దీనితో మన దగ్గర రన్ అయ్యితే 18 రోజులకి వచ్చింది. దీనితో అవతార్ 2 ఇండియాలో ఇంతమొత్తం రాబట్టింది. దీనితో మిగతా వసూళ్లు ఎలా ఉంటాయో అనేది వేచి చూడాలని ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు.