బాక్సాఫీస్ : “అవతార్ 2” ఇండియాలో రెండు రోజుల్లో రికార్డు వసూళ్లు.!

ప్రస్తుతం వరల్డ్ సినిమా ని షేక్ చేస్తున్న మోస్ట్ అవైటెడ్ హాలీవుడ్ చిత్రం “అవతార్ 2”. హాలీవుడ్ డైరెక్టర్ నుంచి వచ్చిన ఎన్నో అద్భుత సృష్టి లలో ఈ చిత్రం కూడా ఒకటి కాగా దీనిపై అయితే అనేక అంచనాలు కూడా నెలకొన్నాయి. ఇక ఈ చిత్రం డెఫినెట్ గా మరింత స్థాయి హిట్ అవుతుంది అని అంతా అనుకున్నట్టే సెన్సేషనల్ ఓపెనింగ్స్ ఈ సినిమాకి ఆల్ ఓవర్ వరల్డ్ దక్కాయి.

మరి ఇదే రకంగా ఇండియన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర కూడా అవతార్ 2 కి మాసివ్ ఓపెనింగ్స్ దక్కాయి కాకపోతే ఈ చిత్రం ముందు ఎవెంజర్స్ ఎండ్ గేమ్ ఓపెనింగ్స్ ని బీట్ చెయ్యలకేపోయింది కానీ రెండో రోజు కూడా బాక్సాఫీస్ దగ్గర దుమ్ము లేపినట్టుగా ట్రేడ్ వర్గాలు చెప్తుతున్నాయి. మరి ఈ రెండు రోజుల్లో అయితే ఈ చిత్రం 90 కోట్ల మేర గ్రాస్ ని కొల్లగొట్టేసినట్టు తెలుస్తుంది.

మొదటి రోజు ఈ చిత్రానికి 41 నుంచి 45 కోట్ల మేర గ్రాస్ వసూలు కాగా రెండో రోజు 45 కోట్లు వచ్చినట్టుగా ట్రేడ్ వర్గాలు కన్ఫర్మ్ చేశారు. దీనితో ఈ రెండు రోజుల్లోనే ఈ సినిమా ఏకంగా 90 కోట్లు రాబట్టేసింది అని చెప్పొచ్చు. అయితే ఈ సినిమా ముందు 400 కోట్ల భారీ టార్గెట్ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఉంది. ఇదే స్పీడ్ కానీ కంటిన్యూ అయితే ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్లో ఈ వసూళ్లు ఉంటాయని చెప్పొచ్చు.