బాక్సాఫీస్ : ఇండియాలో “అవతార్ 2” ఫస్ట్ వీకెండ్ సెన్సేషనల్ వసూళ్లు.!

లేటెస్ట్ హాలీవుడ్ సెన్సేషన్ చిత్రం “అవతార్ 2” ఇప్పుడు భారీ మొత్తంలో వసూళ్లతో అయితే దూసుకెళ్తుంది. ఇండియన్ సినిమా దగ్గర కూడా భారీ అంచనాలు నడుమ సహా భారీ సంఖ్యలో స్క్రీన్స్ నడుమ రిలీజ్ అయ్యిన ఈ చిత్రం రెండు రోజుల్లోనే ఇండియా నుంచి 100 కోట్ల మేర వసూళ్లు అందుకొని దుమ్ము లేపింది.

ఇక లేటెస్ట్ గా అయితే మొదటి మూడు రోజుల వసూళ్లు డీటెయిల్స్ తడి వర్గాలు రివీల్ చేశారు. మరి మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజు ఎక్కువ ఇక మూడో రోజు అయితే మరింత స్థాయిలో భారీ జంప్ ని ఈ సినిమా అందుకున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది.

మరి మూడో రోజు ఏకంగా 60 కోట్ల గ్రాస్ మేర వసూలు చేయగా కేవలం ఈ మూడు రోజుల్లో అవతార్ 2 ఇండియన్ సినిమా దగ్గర అన్ని భాషల్లో 160 కోట్లు అందుకొని దుమ్ము లేపింది. ఇది మాత్రం మాములు సెన్సేషన్ కాదని చెప్పాలి. అయితే అసలు టెస్ట్ ఈ సోమవారం కూడా ఈ రేంజ్ వసూళ్లు వచ్చాయా ఇండియన్ సినిమా దగ్గర అవతార్ 2 హైయెస్ట్ హాలీవుడ్ గ్రాసర్ గా తప్పక నిలుస్తుందని చెప్పి తీరాలి.

దీనికి ముందు అయితే అవెంజర్స్ ఎండ్ గేమ్ 400 కోట్లతో ఉంది అది లైఫ్ టైం కాగా అవతార్ 2 కి 160 కోట్లు అందుకోడానికి జస్ట్ 3 రోజులు పట్టింది. ఈ సోమవారం వసూళ్లు కూడా ఈ రేంజ్ లో ఉంటే ఈ సినిమా ఖచ్చితంగా ఆల్ టైం రికార్డు సెట్ చేస్తుంది.