బాక్సాఫీస్ : “అవతార్ 2” తెలుగు స్టేట్స్ లో సెన్సేషనల్ మార్క్ కి దగ్గరగా.!

తెలుగులో సినిమాలు ఏ రకంగా ఆడుతాయో ఏ రేంజ్ ఆదరణ అందుకుంటాయో మన అందరికీ తెలిసిందే. సౌత్ లో అయితే ఏ ఇతర భాషా ప్రేక్షకులు ఇవ్వని ఆదరణ అయితే మన తెలుగు ప్రేక్షకులు ఇవ్వడం విశేషం. అందుకే పాన్ ఇండియా స్టార్ హీరోలకి మన తెలుగు ఆడియెన్స్ అంటే అమితమైన ప్రేమ.

ఇక ఇదే రకంగా ఇండియన్ సినిమా దగ్గర లేటెస్ట్ గా భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రం “అవతార్ ది వే ఆఫ్ వాటర్”. హాలీవుడ్ టాప్ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ తెరకెక్కించిన ఈ మైండ్ బ్లాకింగ్ విజువల్ ట్రీట్ మరోసారి వరల్డ్ ఆడియెన్స్ ని ఇంప్రెస్ చేసింది.

ఇక తెలుగులో ఈ చిత్రం అయితే భారీ వసూళ్లు రాబడుతూ దూసుకెళ్తుంది. మరి మూడు రోజుల్లోనే ఈ చిత్రం దాదాపు 40 కోట్ల మేర రాబట్టగా ఇప్పుడు లేటెస్ట్ గా అయితే 50 కోట్ల సెన్సేషనల్ మార్క్ కి చేరువలో ఈ సినిమా ఉన్నట్టుగా తెలుస్తుంది. మన తెలుగులో ఇప్పుడు ఈ చిత్రం 47 నుంచి 48 కోట్ల మార్క్ కి చేరుకుందట.

దీనితో అయితే ఈ రోజు వసూళ్లతో డెఫినెట్ గా 50 కోట్ల క్లబ్ లో ఈ చిత్రం చేరిపోవడం గ్యారెంటీ. మరి ఈ మంగళవారం కూడా 9 కోట్ల మేర గ్రాస్ ని తెలుగు స్టేట్స్ లో ఈ చిత్రం కొల్లగొట్టడం ట్రేడ్ వర్గాలకి షాకింగ్ గా మారింది. మరి ఈ విధంగా అయితే అవతార్ 2 పై మన తెలుగు ఆడియెన్స్ ప్రేమ కురిపిస్తున్నారు. మరి ఇది ఎంత వరకు వెళ్తుందో అనేది చూడాలి.