బాక్సాఫీస్ : ఇండియాలో రికార్డ్ ఫిగర్ కొట్టిన “అవతార్ 2” కలెక్షన్స్.!

ఇప్పుడు వరల్డ్ సెన్సేషన్ చిత్రం “అవతార్ 2” కోసం అందరికీ తెలిసిందే. మరి ఇండియా లో అయితే ఈ చిత్రం అనుకున్న రేంజ్ లోనే వసూళ్లు అయితే రాబడుతు దూసుకెళ్తుంది. మరి మొదటి మూడు రోజుల్లోనే ఈ చిత్రం 160 కోట్ల మేర భారీ గ్రాస్ ని ఈ చిత్రం రాబట్టేయగా ఇప్పుడు అయితే ఇండియా లో ఐదు రోజుల వసూళ్లు వివరాలు ఇప్పుడు తెలుస్తున్నాయి.

ఈ చిత్రం ఈ నాలుగు రోజుల్లో అయితే సెన్సేషనల్ మార్క్ ని అందుకున్నట్టుగా ఇప్పుడు ట్రేడ్ వర్గాలు అయితే కన్ఫర్మ్ చేశారు. మరి దీనితో అయితే ఈ భారీ చిత్రం టోటల్ గా 200 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరినట్టుగా తెలుస్తుంది. దీనితో హాలీవుడ్ నుంచి ఫాస్టెస్ట్ గ్రాసింగ్ సినిమాగా ఇది ఇప్పుడు నిలిచి దూసుకెళ్తుంది.

అయితే కొన్ని బాలీవుడ్ వర్గాలు చెప్తున్నా నెట్ వసూళ్ల ప్రకారం అయితే ఈ చిత్రం 180 నుంచి 190కోట్ల నెట్ వసూళ్లు అందుకున్నట్టుగా తెలుస్తుంది కానీ కంప్లీట్ గ్రాస్ అయితే ఇండియాలో అవతార్ 2 200 కోట్ల మార్క్ ని కొట్టేసిందట.

మొత్తానికి మళ్ళీ జేమ్స్ కామెరాన్ అయితే వరల్డ్ బాక్సాఫీస్ సహా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర కూడా సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం వీక్ డేస్ లో కూడా స్టడీ వసూళ్లు వస్తున్నట్టు ట్రేడ్ సర్కిల్స్ చెప్తున్నాయి. మరి ఇండియా లో ఫైనల్ రన్ మోసం అంతా ఆసక్తిగా ఉన్నారు.