Bheemla Nayak : బాక్సాఫీస్ రిపోర్ట్ : ఒక్క భాగ్యనగరంలోని “భీమ్లా” మాస్ వసూళ్ల వివరాలు.!

Bheemla Nayak : ఇంకొక్క రోజులో మళ్ళీ టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మరో భారీ సినిమా తన మాస్ చూపించడానికి రెడీగా ఉంది. ఆ సినిమానే “భీమ్లా నాయక్”. గాడ్ ఆఫ్ మాసెస్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి హీరోలుగా చేసిన ఈ చిత్రం భారీ స్థాయిలో రిలీజ్ కి రెడీగా ఉంది.

ఇక నిన్న జరిగిన ప్రీ రిలీజ్ సహా సరికొత్త రిలీజ్ ట్రైలర్ తో మరిన్ని అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం మొదటి రోజు రికార్డు స్థాయి వసూళ్లనే కొల్లగొట్టడం ఖాయం అని ఆల్రెడీ అర్ధం అయ్యిపోయింది. ఒక్క ఏపీలో తప్ప మిగత అన్ని చోట్లా ఈ సినిమాకి ఊహించని బుకింగ్స్ నమోదు అవుతున్నాయి.

మరి లేటెస్ట్ గా బాక్సాఫీస్ రిపోర్ట్స్ కూడా తెలుస్తున్నాయి. ఈ వసూళ్లకు సంబంధించి కీలక ప్రాంతాల్లో నైజాం కూడా ఒకటి. అయితే ఇక్కడ ఒక్క భాగ్యనగరంలో ఈ చిత్రం కేవలం బుకింగ్స్ తోనే మొట్ట మొదటి రోజు ఏకంగా 6 కోట్లు వసూలు చేసేసింది అట.

దీనితో మిగతా అన్ని ఏరియా లు కలుపుకొని ఫస్ట్ డే నైజాం లో భీమ్లా నాయక్ ఆల్ టైం రికార్డు ఫిగర్ నమోదు చెయ్యడం కన్ఫర్మ్ అని సినీ వర్గాల వారు చెబుతున్నారు. మొత్తానికి అయితే భీమ్లా నాయక్ నుంచి ఓ రేంజ్ మాస్ చూడబోతున్నామని చెప్పాలి. ఇక అలాగే ఈ సినిమాకి సాగర్ చంద్ర దర్శకత్వం వహించగా థమన్ సంగీతం అందించాడు. అలాగే నాగవంశీ నిర్మాణం వహించారు.