బాక్సాఫీస్ : ఫస్ట్ వీక్ కి “గుంటూరు కారం” రీజనల్ గా ఆల్ టైం రికార్డ్ 

టాలీవుడ్ ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం “గుంటూరు కారం” ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కి వచ్చింది. కాగా ఈ చిత్రం రిలీజ్ అయ్యాక రెస్పాన్స్ అంత పాజిటివ్ గా రాలేదు కానీ వసూళ్లు మాత్రం పలు చోట్ల క్రేజీ వసూళ్లు సాధిస్తూ వెళ్తుంది.

అలాగే ఈ చిత్రం యూఎస్ మార్కెట్ లో డల్ అయ్యింది. అలానే నిజాం లో కూడా డ్రాప్స్ కనిపిస్తున్నాయి కానీ ఏపీలో మాత్రం ఈ సినిమాకి మంచి వసూళ్లు వస్తున్నాయి. దీనితో కాస్త అటు ఇటుగానే ఈ సినిమా భారీ వసూళ్లు అందుకుంది అని ట్రేడ్ వర్గాలు సినిమా యూనిట్ కూడా చెప్తున్నారు.

ఇలా మొదటి వారం రోజుల రన్ ని సినిమా కంప్లీట్ చేసుకోగా దీనితో ఈ చిత్రం ఆల్ టైం రికార్డు గ్రాస్ ని ఈ మొదటి వారంలో అందుకున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. దీనితో ఈ చిత్రం 212 కోట్ల గ్రాస్ ని జస్ట్ మొదటి వారం లోనే అందుకున్నట్టుగా తెలిపారు.

ఇక ఇది మాత్రం రీజనల్ గా ఒక ఆల్ టైం రికార్డుగా మేకర్స్ అనౌన్స్ చేశారు. దీనితో గుంటూరు కారం వారు చెప్తున్నా దాని ప్రకారం భారీ హిట్ అనే చెప్పాలి. కాగా ఈ చిత్రంలో హీరోయిన్ గా శ్రీలీల నటించగా మీనాక్షి చౌదరి మరో రోల్ లో నటించింది. అలాగే థమన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని హారిక హాసిని ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.