ఇద్దరూ అప్రమత్తంగా ఉండాలి.. నిర్మాత సురేష్ బాబు వైరల్ కామెంట్స్!

సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్ కారణంగా రేవంత్ రెడ్డి సినిమా టికెట్లు పెంచడానికి, బెనిఫిట్ షోస్ కి పర్మిషన్ ఇవ్వను అంటూ తీసుకున్న నిర్ణయం గురించి అందరికీ తెలిసిందే. అయితే ఆ విషయంపై చర్చించటానికి టాలీవుడ్ ప్రముఖులందరూ నిర్మాత రేవంత్ రెడ్డితో భేటీ అవ్వటానికి వెళ్లారు. అయితే అక్కడి నుంచి వెళ్లి వచ్చిన తరువాత నిర్మాత సురేష్ బాబు ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పలు కీలక విషయాలను గురించి ప్రస్తావించారు. సంధ్య థియేటర్ దగ్గర జరిగిన సంఘటన చాలా చాలా బాధాకరమైనది.

అలాంటి ఘటనలు జరక్కుండా భవిష్యత్తులో చర్యలు తీసుకోవాలి. సెలబ్రిటీలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజుల్లో అందరి చేతుల్లోనూ సెల్ ఫోన్లు ఉన్నాయి. స్టార్లు ఎక్కడ కనిపించినా ఫోటోల కోసం మీద పడిపోతున్నారు. స్టార్లను తోసే పబ్లిక్, పబ్లిక్ ను తోసే స్టార్లు.. ఇద్దరూ ఎంతో అప్రమత్తంగా ఉండాలి. పబ్లిక్ ప్లేసుల్లో ఈవెంట్స్ చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి’ అని నిర్మాత సురేశ్ బాబు అన్నారు.పబ్లిక్ ఈవెంట్స్ నిర్వహణలో కచ్చితంగా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతమంది జనం ఉంటే మనం వెళ్లకూడదు కదా అని వాళ్లని వాళ్లు కంట్రోల్ చేసుకోవాలి.

క్రౌడ్ ను కంట్రోల్ చేసే వాళ్లు మరింత బెటర్ గా కంట్రోల్ చేయాలి. పోలీస్, లోకల్ సెక్యూరిటీ.. ఇది ప్రతీ ఒక్కరి బాధ్యత. అలాగే పిల్లలతో రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు పేరెంట్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ ఎంతమంది ఉంటారు, అక్కడ మనం ఎలా ప్రవర్తించాలి అనేది పిల్లలకి ముందుగానే చెప్పాలి. ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించినా పర్వాలేదు కానీ బయటికి వచ్చినప్పుడు పద్ధతిగా ఉండాలి అంటూ ఇంట్లోనే వాళ్లని ప్రిపేర్ చేయాలి అని సూచించారు.

అలాగే చిన్న సినిమాలు నిలదొక్కుకునే పరిస్థితి ఉందా అని విలేకరులు అడిగిన ప్రశ్నకి సమాదానంగా సక్సెస్ రేట్ ఉండాలంటే ముందు మనం సినిమా బాగా తీయాలి. బలగం అనేది చిన్న సినిమాయే కానీ ప్రేక్షకులు ఎంత బాగా ఆదరించారు. అలాగే రీసెంట్గా వచ్చిన అమరన్ చిత్రం కూడా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. మంచి సినిమా ఎవరు తీసిన దానికి మార్కెట్ ఉంటుందని చెప్పారు సురేష్ బాబు.

ఇంట్లో ఎలా ఉన్నా బయట పద్ధతిగా ఉండాలి.. | Daggubati Suresh Babu | Allu Arjun | 10TV Ent

Daggubati Suresh Babu Exclusive Interview | సీఎంతో భేటీ వండర్ ఫుల్ :: దగ్గుబాటి సురేశ్ బాబు | 10TV