బాధ్యత ఉండక్కర్లే.. జక్కన్నపై శ్రీదేవి భర్త గరం గరం

RRR సినిమా విడుదల తేదీని మొత్తానికి ఎనౌన్స్ అయితే చేశారు. అక్టోబర్ 13న తప్పకుండా సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని క్లారిటీ ఇచ్చేశారు. కానీ సినిమా అనుకున్న సమయానికి వస్తుందా రాదా అనేది మరో మిస్టరీ అని చెప్పవచ్చు. ఇప్పటికే రెండు తేదీలు మిస్ అయ్యాయి. ఆ తప్పంతా కరోనా మీద వేసినప్పటికి ఇప్పుడు జక్కన్నపై పూర్తిగా నమ్మకం పెట్టుకోవడం కష్టంగానే ఉంటుంది. ఇక సినిమా విడుదల తేదీపై ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్స్ కాస్త అసంతృప్తితో అయితే ఉన్నారు.

Poonam Kaur likes Fan tweet On Pawan kalyan
 

ఎందుకంటే సినిమా విడుదలను సంక్రాంతికి విడుదల చేస్తేనే బావుంటుందని అంటున్నారు. 450కోట్ల బడ్జెట్ తో వస్తున్న సినిమా కాబట్టి కలెక్షన్స్ అప్పుడు తొందరగా వస్తాయని ఆలోచిస్తున్నారు. ఇక ఇంతలో శ్రీదేవి భర్త RRR రిలీజ్ డేట్ పై అసహనం వ్యక్తం చేశాడు. RRR కంటే ముందే బోణి కపూర్ తన సొంత బ్యానర్ లో రూపొందిస్తున్న మైదాన్ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించాడు. ఆ సినిమా కూడా అదే సమయంలో రాబోతోంది.

అయితే ఒక సోదర భావంతో ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయంను బాధ్యత లేకుండా రెండు పెద్ద సినిమాలు క్లాష్ అయ్యే విధంగా రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేయడం ఎంత మాత్రం కరెక్ట్ కాదని అసహనం వ్యక్తం చేశారు. మైదాన్ సినిమా ఫుట్‌బాల్ లెజెండ్ అబ్దుల్ రహిం జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ సినిమా కూడా తెలుగు తమిళ్ మళయాళం హిందీ భాషల్లో పాన్ ఇండియా సినిమా రేంజ్ లో రిలీజ్ అవుతోంది. ఇక బోణి కపూర్ త్వరలోనే ఈ విషయంపై RRR నిర్మాతతో చర్చలు జరిపే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.