సుకుమార్ – విజయ్ దేవరకొండ క్రేజీ కాంబినేషన్ లో బాలీవుడ్ యంగ్ బ్యూటీ .?

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా స్టార్ డైరెక్టర్స్ తో సినిమాలు కమిటవుతున్నాడు. ఇస్మార్ట్ శంకర్ తో బౌన్స్ బ్యాక్ అయిన డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఫైటర్ అన్న వర్కింగ్ టైటిల్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ ఇమేజ్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగ తో విజయ్ నెక్స్ట్ సినిమా ఉంటుందని అంటున్నారు. అలాగే ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శక్వంలో సినిమా చేస్తాడని అన్నారు. కాని ఊహించని కాంబినేషన్ ఇప్పుడు అనౌన్స్ అయి అందరికీ షాకిచ్చింది.

 

After Puri, it is Sukumar for Vijay Devarakonda | klapboardpost

ఇన్నాళ్ళు ఏ ఒక్కరు విజయ్ దేవరకొండ – సుకుమార్ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని ఊహించలేదు. కాని తాజాగా ఈ కాంబినేషన్ లో ప్రాజెక్ట్ అనౌన్స్ అవగానే బ్లైండ్ గా ఇది పాన్ ఇండియన్ సినిమా అని ఫిక్సైపోయారు. అవును సుకుమార్ – విజయ్ కాంబోలో రాబోయో సినిమా పాన్ ఇండియన్ సినిమాగా ప్లాన్ చేస్తున్నారు. విజయ్ .. పూరి తో చేస్తున్న సినిమా పాన్ ఇండియన్ సినిమాగా 4 భాషల్లో రిలీజ్ అవనుంది. అలాగే సుకుమార్ అల్లు అర్జున్ తో రూపొందిస్తున్న పుష్ప సినిమా కూడా 5 భాషల్లో రూపొందుతుంది.

Ananya Pandey creates headlines with Vijay Devarakonda with their  late-night bike ride

దాంతో ఈ తాజా కాంబినేషన్ మీద ఇప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే పాన్ ఇండియన్ సినిమా కాబట్టి విజయ్ కి జంటగా నటించే హీరోయిన్ విషయంలో అప్పుడే చర్చలు మొదలయ్యాయి. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ యంగ్ బ్యూటీ నటించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని సమాచారం. ప్రస్తుతం విజయ్ – పూరి కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాలో కూడా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తున్న సంగతి తెలిసిందే.

Kiara Advani vs Jahnvi Kapoor: Who slays the fashion game? | IWMBuzz

అలాగే ఈ సినిమాలో కూడా సుకుమార్.. విజయ్ కి జంటగా అందాల తార శ్రీదేవీ కూతురు జాన్వీ కపూర్ ని గాని లేదా కియారా అద్వానీ గాని నటింపచేయాలని అనుకుంటున్నారట. ఈ ఇద్దరు ఇప్పుడు బాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకున్నారు. ఇందుకు సంబంధిన అఫీషియల్ న్యూస్ త్వరలో వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. సుకుమార్ ప్రస్తుతం తెరకెక్కిస్తున్న ‘పుష్ప’ కంప్లీట్ చేసి ఈ సినిమాని సెట్స్ మీదకి తీసుకువెళతాడని అంటున్నారు. ఇక ఈ సినిమాని ఫాల్కన్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.1 గా కేదార్ సెలగం శెట్టి నిర్మిస్తున్నారు.