బాలీవుడ్‌ యాక్షన్‌ మూవీ త్వరలో ఓటీటీ స్ట్రీమింగ్‌ కి !!

హృతిక్‌ రోషన్‌, దీపికా పదుకోనే జంటగా నటించిన బాలీవుడ్‌ యాక్షన్‌ మూవీ ఫైటర్‌. ఈ మూవీకి సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించాడు. గతేడాది దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ షారుక్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కించిన పఠాన్‌ మూవీ బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అయింది.దీనితో ఫైటర్‌ మూవీకి విడుదలకు ముందు భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి..భారీ అంచనాలతో ఈ ఏడాది రిపబ్లిక్‌ డే కానుకగా రిలీజ్‌ అయిన ఫైటర్‌ మూవీకి మిక్స్డ్‌ టాక్‌ వచ్చింది. 19 రోజుల్లో ఈ మూవీ రూ.340 కోట్లు వసూలు చేసింది. సినిమాకు మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చినా.. బాక్సాఫీస్‌ దగ్గర మాత్రం అద్భుతాలు చేయలేకపోయింది.

ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌ కు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ ‘నెట్‌ఫ్లిక్స్‌’ ఈ సినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకుంది.అయితేఫైటర్‌ మూవీ జనవరి 25న థియేటర్లలోకి రాగా.. రెండు నెలలోపే అంటే మార్చి 21న నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్‌ కానున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటి వరకూ అధికారిక సమాచారం ఏదీ రాలేదు. ఈ చిత్రంలో అనిల్‌ కపూర్‌ ఓ కీలకమైన పాత్ర పోషించారు.ఫైటర్‌ మూవీ ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ సాహసాల చుట్టూ తిరుగుతుంది.

పాకిస్థాన్‌ కు వ్యతిరేకంగా వచ్చిన మరో బాలీవుడ్‌ సినిమా కావడంతో ఆ దేశం నుంచి ఈ మూవీపై ఎన్నో విమర్శలు వచ్చాయి. అయితే వీటికి మూవీ టీమ్‌ గట్టిగానే సమాధానం ఇచ్చింది.అయితే ఫైటర్‌ మూవీ ఈ మధ్య వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా ఎవరిపై చిత్రీకరించారో అదే ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ మూవీ టీమ్‌ కి పెద్ద షాక్‌ ఇచ్చింది. ఫైటర్‌ చిత్రంలో హృతిక్‌ రోషన్‌, దీపికా పదుకోన్‌ ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ యూనిఫాం ధరించి లిప్‌ లాక్‌ సన్నివేశాల్లో నటించారు. దీనిపై అభ్యంతరం తెలుపుతూ ఐఏఎఫ్‌ అధికారి వింగ్‌ కమాండర్‌ సౌమ్యదీప్‌ దాస్‌ నోటీసులు పంపించారు.

ఐఏఎఫ్‌ యూనిఫాం కేవలం దుస్తులు మాత్రమే కాదని, విధి నిర్వహణ, దేశ భద్రత మరియు నిస్వార్థ సేవ పట్ల అచంచలమైన నిబద్ధతకు బలమైన చిహ్నమని ఆ నోటీసులో వారు పేర్కొన్నారు.అలాంటి ఉన్నతమైన దుస్తులు ధరించి లిప్‌ కిస్‌ పెట్టుకోవడం, శృంగారంతో బంధాలను ప్రోత్సహించే సన్నివేశానికి ఉపయోగించడం అంటే వాయుసేన అధికారులను కించపరచడమే అవుతుందని వారు అభిప్రాయపడ్డారు.