Aliya Bhat: వారణాసిలో ఆర్ఆర్ఆర్ అని అరుస్తూ ప్రియుడి ముందే మూవీ ప్రచారం చేసిన బాలీవుడ్ భామ… !

Aliya Bhat: ఏ హీరో లేదా హీరోయిన్ కి ఐనా ఎంట్రీ సినిమా ఏది చేస్తున్నారు, ఫస్ట్ సినిమాల్లో ఎలాంటి పాత్ర చేస్తున్నారు అనేది చాలా ముఖ్యం. దాని మీద ఆధారపడి తరువాత ఫ్యూచర్ అనేది ఉంటుంది. కాబట్టి హీరో హీరోయిన్స్ ఈ విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తారు అని ప్రత్యేకించి చెప్పవలసిన పనిలేదు. ఒకవేళ ఒక ఇండస్ట్రీలో ఎంత పాపులర్ హీరో లేదా హీరోయిన్ అయినా వేరే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టే ముందు కూడా వారు దీన్ని పాటిస్తారు. ఎందుకంటే ఒక్కోసారి ఒక్క సినిమానే వాళ్ళ జీవితాన్ని మార్చేస్తుంది. ఒక్క సినిమానే వాళ్లకు మరిన్ని అవకాశాలు తెచ్చిపెడుతుంది.

ఇక వివరాల్లోకి వెళితే, ప్రముఖ బాలీవుడ్ నటి ఆలియా భట్ హిందీలో ఎంత పాపులర్ హీరోయిన్ అనేది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ మూవీ ద్వారా ఈ సారి తెలుగు ప్రేక్షకులను అలరించడానికి వస్తోంది. సౌత్ లో ఆమె ఇలా ఈ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం కావడం అనేది పర్ఫెక్ట్ ఎంట్రీ అని అంటున్నారు ఆమె అభిమానులు. ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఈ సినిమాలో ఆలియా రామ్ చరణ్ కి జోడీగా సీత పాత్రలో కనిపిస్తారన్న విషయం తెలిసిందే. కాగా ఎన్టీఆర్ సరసన బ్రిటీష్ నటి ఒలీవియా మోర్రే నటిస్తున్నారని సమాచారం.

ఇకపోతే రిలీజ్ డేట్ దగ్గర పడుతుందని తెలిసిన మూవీ టీమ్ ఇప్పటికే ప్రమోషన్స్ లో భాగంగా ఈవెంట్స్, ఇంటర్వ్యూలు ఇస్తున్న విషయం తెలిసిందే. కాగా ఆలియా మాత్రం బాలీవుడ్ లో కొన్ని ప్రాజెక్ట్స్ లో భాగంగా బిజీగా ఉండడంతో ఈ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొనలేక పోయింది. ఐతే తాజాగా ఆమె, తన ప్రియుడు రణబీర్ కపూర్ తో కలిసి బ్రహ్మాస్త్ర అనే సినిమాలో నటిస్తుండగా, షూటింగ్ కోసం ఈ చిత్ర బృందం వారణాసికి వెళ్లినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే బ్రహ్మాస్త్ర మూవీ టీమ్ తో కలిసి నదిలో ప్రయాణిస్తున్న అలియాను చూసిన ఆర్ ఆర్ ఆర్ చిత్రం ఫ్యాన్స్ ఆర్ ఆర్ ఆర్ అంటూ అరవడం ప్రారంభించారు. అది చూసిన ఆలియా సైతం రణభీర్ ముందే ఆర్ఆర్ఆర్ అంటూ కేకలు వేసింది. కాసేపు అలా ఆ ప్రాంతమంతా ఆ ఆర్ ఆర్ ఆర్ అరుపులు, కేకలతో ప్రతిధ్వనించిన వీడియో ఒకటి ఇప్పుడు నేట్టింట్లో సందడి చేస్తోంది. ఇప్పటి వరకూ దాన్ని చూడకపోతే ఆ వీడియో వైపు మీరు కూడా ఓ లుక్కేయండి… !