అందిన అధికారంతో రెచ్చిపోయి రచ్చ చేసిన బిగ్ బాస్ సభ్యులు

boggboss gave power task to ell members

బిగ్ బాస్ సీజన్ 4లో 13వ వారం అఖిల్ మినహా అంద‌రూ నామినేట్ అయిన‌ట్లు బిగ్‌బాస్ ప్ర‌క‌టించాడు. మిమ్మ‌ల్ని మీరు నిరూపించుకోండంటూ ‘అధికారం’ అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో రాజు, రాణి అయ్యేవాళ్లు బిగ్‌బాస్ రూల్స్‌ను మార్చుతూ సొంత నియ‌మాలు పెట్టొచ్చని చెప్పాడు. ఈ టాస్కులో అఖిల్ మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తాడు. మొద‌ట బ‌జ‌ర్ మోగ‌గానే కిరీటాన్ని అందుకుని సోహైల్ రాజుగా అవ‌త‌రించాడు. కిచెన్ ద‌గ్గ‌ర పడేసి ఉన్న బోళ్లు తోమ‌మ‌ని అరియానాను ఆదేశించాడు. మంత్రితో మ‌సాజ్ చేయించుకున్నాడు. హారిక‌తో ఫ్రూట్స్ తినిపించుకున్నాడు. ఈ క్ర‌మంలో మీరే ద‌య‌త‌ల‌చి అఖిల్‌కు, నాకూ పెళ్లి చేయాల‌ని హారిక‌ రాజాను అభ్య‌ర్థించింది. మ‌రోవైపు అరియానా అరాచ‌కాల‌కు అడ్డుక‌ట్ట వేసేందుకు ఆమె నెత్తి మీద నీళ్లు గుమ్మ‌రించాడు. ఇంత‌లో సోహైల్ గ‌డువు ముగిసింది. దీంతో అత‌డు త‌న కిరీటాన్ని అభిజిత్‌కు అప్ప‌గించాడు.

akjhil,. .vs sohail, vs harika

త‌ను రాజుగా ఉన్నంత‌కాలం హారిక మాట‌కు ముందోసారి, చివ‌రోసారి ఇకిలి పికిలి అనే ప‌దాన్ని ఉప‌యోగించాల‌ని అభిజిత్‌ హారికను ఆదేశించాడు. త‌ర్వాత మోనాల్ పాట పాడ‌గా దానికి సోహైల్‌, అరియానా రొమాంటిక్ డ్యాన్స్ చేశారు. అనంత‌రం మ‌హారాణిగా మారిన హారిక‌.. త‌ను చెప్పిన‌వి చేయ‌క‌పోతే బ‌ట్ట‌లు స్విమ్మింగ్ పూల్‌లో ప‌డేస్తాన‌ని హెచ్చ‌రించింది. దీంతో అంత ప‌ని చేయొద్దంటూ ఆమెను కూల్ చేసేందుకు సోహైల్ ముద్దు పెట్టాడు. అక్క‌డే ఉన్న‌ అఖిల్ ఛాన్సు వ‌దిలేది లేద‌ని క‌క్కుర్తి పడ్డాడు. నాకు కూడా పెట్టాల్సిందేన‌ని ప‌ట్టుప‌డ్డాడు. రాణి కాలం ముగిశాక పెడ్తాన‌ని చెప్పి హారిక ఆ స‌మ‌యానికి త‌ప్పించుకుంది.

ఇక అభిజిత్ కూడా హారిక‌ను పొగిడిన‌ట్లే పొగిడి ఇదంతా అబ‌ద్ధ‌మ‌ని ఝ‌ల‌క్ ఇవ్వ‌గా ఆగ్ర‌హించిన రాణి అత‌డి బ‌ట్ట‌ల‌ను స్విమ్మింగ్ పూల్‌లో ప‌డేసింది. త‌ర్వాత‌ పువ్వుతో నాన్‌స్టాప్‌గా ప్ర‌పోజ్ చేయాల‌ని సోహైల్‌ను ఆదేశించింది. ఇది చాలా ఈజీ అని అఖిల్ చెప్ప‌డంతో హారిక మ‌రో టాస్క్ ఇచ్చి దాన్ని 15 సెక‌న్ల‌లో పూర్తి చేయాలంది. దీంతో తిక్క లేచిన సోహైల్ బాడీ లాంగ్వేజే మారిపోయింది. అయినా స‌రే వినిపించుకోని రాణి రెండు షూల లేస్‌ను క‌లిపి క‌ట్టుకొని డ్యాన్స్ చేయాలంది. ఆమె ముందు గాల్లోకి లేస్తూ డ్యాన్స్ చేసిన సోహైల్ లోప‌ల‌కు వ‌చ్చి త‌న ఉక్రోషాన్ని వెల్ల‌గ‌క్కాడు.

మంత్రి మ‌ధ్య‌లో ఎందుకు దూరుతున్నాడ‌ని సోహైల్‌ ఆగ్ర‌హించాడు. నేను రాజుగా ఉన్న‌ప్పుడు ఒక్క ప‌ని చేయ‌లేదు కానీ ఆమె రాణిగా ఉన్న‌ప్పుడు మాత్రం అన్ని ప‌నులు చేస్తున్నాడ‌ని అఖిల్ మీద మండిప‌డ్డాడు. బ‌ట్ట‌లు నీళ్ల‌లో ప‌డేయ‌డం ఎంట‌ర్‌టైన్‌మెంట్ కాద‌ని చెప్పాడు. నా బ‌ట్ట‌లు ప‌డేసి చూడ‌మ‌ను, అంద‌రివి నీళ్ల‌ల్లో వేసి ఉతుకుతా అని ఫ్ర‌స్టేట్ అయ్యాడు. ఇక‌ అఖిల్ పాట‌కు అరియానా చేసిన డ్యాన్స్ బాగుంది. అలా హారిక రాజ్యం గొడ‌వ‌ల‌తోనే జ‌రిగిపోయింది. రేపు మోనాల్‌, అరియానా రాణిగా ఎలా చెల‌రేగిపోతారో చూడాలి.