NBK108 – బాలయ్య బర్త్ డే బ్లాస్ట్ మామూలుగా ఉండదట.!

టాలీవుడ్ మాస్ గాడ్ నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ ఈ ఏడాది లో తాను నటించిన వీర సింహా రెడ్డి చిత్రంతో తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకోగా హీరోగా ఇప్పుడు సెన్సేషనల్ లైనప్ తో అయితే బిజీగా ఉండగా వాటిలో సక్సెస్ ఫుల్ దర్శకుడు అనీల్ రావిపూడి తో బాలయ్య కెరీర్ లో 108వ సినిమా చేస్తుండగా..

ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొనగా ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు శరవేగంగా తెరకెక్కిస్తుండగా కాజల్ అగర్వాల్ మరియు యంగ్ హీరోయిన్ శ్రీ లీల ఈ చిత్రంలో నటిస్తున్నారు. కాగా ఈ చిత్రం నుంచి అయితే మేకర్స్ ఇప్పుడు బిగ్ అప్డేట్ ని అందించారు.

ఈ జూన్ నెల 10న బాలయ్య బర్త్ ఉన్న సంగతి తెలిసిందే. మరి ఈసారి బాలయ్య బర్త్ డే కి ఇచ్చే ట్రీట్ మామూలుగా ఉండదు అని అంటున్నారు. అలాగే నెవర్ బిఫోర్ లెవెల్లో అయితే బాలయ్య బర్త్ డే ని చేసుకుందాం అని క్రేజీ అప్డేట్ అందించారు. ఇక మరిన్ని బూమ్బరాంగ్ అప్డేట్స్ అయితే ఇస్తున్నామని తెలిపారు.

దీనితో ఈ జూన్ 10 మాత్రం మామూలుగా ఉండదని చెప్పొచ్చు. కాగా ఈ చిత్రం నుంచి అయితే ఆరోజు టైటిల్ తో పాటుగా సినిమా ఫస్ట్ గ్లింప్స్ లేదా తెఅస్సేర్ వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాని షైన్ స్క్రీన్ సినిమాస్ వారు నిర్మాణం వహిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.