లేటెస్ట్ : “భోళా శంకర్” ట్రైలర్ బ్లాస్ట్ డేట్ వచ్చేసింది!

ఇప్పుడు టాలీవుడ్ నుంచి రానున్న భారీ చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న మాస్ డ్రామా “భోళా శంకర్” కూడా ఒకటి కాగా తాను ఆల్రెడీ నటించిన రీసెంట్ చిత్రం “వాల్తేరు వీరయ్య” తో మెగాస్టార్ ఈ ఏడాదిలో మొదటి హిట్ అందుకోగా ఇక రెండో చిత్రంగా అయితే ఇప్పుడు “భోళా శంకర్” తో మరో హిట్ ను అందుకోవాలని చూస్తున్నారు.

ఇక ఈ చిత్రం రిలీజ్ కి దగ్గర పడుతుండగా ఓ పక్క పాటలు ప్లాప్ అవుతున్నాయి. ఈ గ్యాప్ లో అయితే ఈ చిత్రం ట్రైలర్ పై మేకర్స్ ఇప్పుడు క్రేజీ అప్డేట్ అందించారు. ఈ చిత్రం అవైటింగ్ ట్రైలర్ ని అయితే ఈ జూలై 27 న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.

దీనితో పాటుగా మెగాస్టార్ పై రిలీజ్ చేసిన పోస్టర్ కూడా అదిరే లెవెల్లో అనిపిస్తూ మెగా ఫ్యాన్స్ కి మంచి ఎగ్జైట్మెంట్ ని అందిస్తుంది. ,మరి ఆ రోజు వచ్చే ట్రైలర్ అయితే ఎలా ఉంటుందో చూడాల్సిందే. కాగా ఈ చిత్రానికి దర్శకుడు మెహర్ రమేష్ వర్క్ చేస్తుండగా తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది.

అలాగే ఆమె నిన్ననే తన టోటల్ డబ్బింగ్ ని కూడా కంప్లీట్ చేయగా మరో హీరోయిన్ కీర్తి సురేష్ అయితే చిరు కి చెల్లి పాత్రలో ఈ సినిమాలో నటిస్తుంది. కాగా సుమంత్, గెటప్ శ్రీను తదితరులు నటిస్తుండగా మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు అలాగే ఈ ఆగస్ట్ 11న సినిమా గ్రాండ్ రిలీజ్ కాబోతుంది.