బాలకృష్ణ – బోయపాటి శ్రీనుల బిబి 3 లో ఊహించని నటుడు ..?

బాలకృష్ణ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో హ్యాట్రి సినిమా తయారవుతున్న సంగతి తెలిసిందే. బిబి3 అన్న వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుస్తున్న ఈ సినిమాని మిరియాల రవీందర్ రెడ్డి ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఇప్పటికే బాలయ్య – బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్ సినిమాలు భారీ కమర్షియల్ హిట్స్ గా నిలిచాయి. చెప్పాలంటే బాలయ్య కి ఫ్లాప్స్ వస్తున్న సమయంలో బోయపాటి ఊహించని విధంగా రెండూ భారీ కమర్షియల్ హిట్స్ ఇచ్చాడు. దాంతో తాజాగా తెరకెక్కుతున్న బాలకృష్ణ – బోయపాటి శ్రీనుల బిబి 3 మీద భారీగా అంచనాలు నెలకొన్నాయి.

balakrishna movie simha songs download

ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన బిబి 3 ఫస్ట్ రోర్ తో బాలయ్య అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోనూ అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఈ మధ్య కాలంలో బాలయ్య తో పాటు బోయపాటి కి సరైన హిట్స్ లేకపోవడం తో ఈ సినిమా కోసం ఎంతో కసిగా పనిచేస్తున్నారు. కాగా లాక్ డౌన్ తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ షెడ్యూల్ ని కంప్లీట్ చేశారు. ఈ షెడ్యూల్ లో బాలయ్య తో పాటు హీరోయిన్స్ ప్రగ్యా జైస్వాల్, పూర్ణ .. తదితరులు పాల్గొన్న కీలకమైన సీన్స్ ని కంప్లీట్ చేశాట. కాగా నెక్స్ట్ షెడ్యూల్ ని కూడా ఔట్ డోర్ లో ప్లాన్ చేసినట్టు సమాచారం.

News18 Telugu - NBK-Boyapati Srinu: బాలకృష్ణ బోయపాటి సినిమాలో అఖిల్ భామతో  పాటు మరో కథానాయికగా వరుణ్ భామ.. | NBK- Boyapati Srinu BB3 Sayesha Saigal  and pragya jaiswal Also romance with ...

కాగా ఈ సినిమాలో కీలక పాత్ర లో సీనియర్ హీరో శ్రీకాంత్ నటిస్తున్నట్టు లేటెస్ట్ న్యూస్. ఇప్పటికే శ్రీకాంత్ హీరోగా నటిస్తూనే కొన్ని సినిమాలలో కీలక పాత్రలు పోషిస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి తో శంకర్ దాదా అలాగే మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో గోవిందుడు అందరివాడేలే సినిమాలలో నటించాడు. ఈ సినిమాలలోని పాత్రలు శ్రీకాంత్ కి మంచి పేరు తీసుకు వచ్చాయి. కాగా ఇప్పుడు బాలయ్య బిబి 3 లో కీలక పాత్ర కోసం శ్రీకాంత్ ని ఎంచుకున్నారట దర్శకుడు బోయపాటి శ్రీను. ఇందుకు సంబంధించిన అఫీషియల్ న్యూస్ త్వరలో రానుందట.