Big Boss Non Stop: పిచ్చి చేష్టలతో పాతాళానికి పడిపోయిన బిందుమాధవి..!

Big Boss Non Stop: బిగ్ బాస్ నాన్ స్టాప్ కార్యక్రమంలో ఫ్యామిలీ మెంబర్స్ రావడంతో కంటెస్టెంట్ లో తెలియని ఉత్సాహం కనబడుతోంది. ఈ క్రమంలోనే కంటెస్టెంట్ లు వారి ఆట పై మరింత ఆసక్తి చూపెడుతున్నారు. ఇక గ్రాండ్ ఫినాలే దగ్గర పడటంతో ప్రతి ఒక్కరు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ టైటిల్ రేసులో అఖిల్, శివ, బిందు మాధవి ఉన్నారు.అయితే కొందరు ఈ సారి తప్పకుండా బిందుమాధవి టైటిల్ గెలుస్తుందని వారి అభిప్రాయాలను కూడా తెలియజేస్తున్నారు.

ఇప్పటివరకు బిందుమాధవి కూడా అలాగే తన ఫర్ఫార్మెన్స్ చూపించారు. అయితే ఈ వారం నామినేషన్ల భాగంగా బిందుమాధవి చేస్తున్న వింత ప్రవర్తన కారణంగా ఎలిమినేట్ బిందు మాధవి అనే హష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు.అయితే బిందు మాధవి ఈ విధంగా ట్రోల్ అవడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే.. ప్రతివారం నామినేషన్ లో భాగంగా నామినేషన్ లో ఉన్న కంటెస్టెంట్ లను మిత్ర ఇమిటెడ్ చేసేది. అయితే ఈ వారం మిత్ర స్థానాన్ని బిందుమాధవి తీసుకున్నారు.

ఈవారం మిత్ర మాట్లాడుతూ ఉండగా బిందు మాధవి తన పిచ్చి పిచ్చి చేష్టలతో వింతగా ప్రవర్తించింది. దీంతో ఎంతో మంది నెటిజన్లు బిందుమాధవి ఏంటి ఇలా ప్రవర్తిస్తోంది అంటూ దారుణంగా ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఇక ఇదే బిందుమాధవి వరెస్ట్ పర్ఫామెన్స్ అంటూ మరి కొందరు కామెంట్ చేస్తున్నారు. ఏదిఏమైనా ఇన్ని రోజులు టైటిల్ రేస్ లో ఉన్నటువంటి బిందుమాధవి ఈ ఒక్క ఎపిసోడ్ తో పాతాళానికి పడిపోయింది. ఇక ఈ వారం నామినేషన్ల భాగంగా బాబా భాస్కర్ మాస్టర్ నటరాజ్ మాస్టర్ మినహా మిగిలిన అందరూ నామినేషన్ లో ఉన్నారు.