బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ గత ఆదివారం గ్రాండ్ గా ముగిసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం కంటెస్టెంట్స్ అందరు కూడా వరుస ఇంటర్వ్యూలతో మీడియాలో బిజీగా మారారు, గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ సారి కంటెస్టెంట్స్ కు మంచి గుర్తింపు దక్కుతోంది. ఇక బిగ్ బాస్ హౌజ్ ద్వారా గంగవ్వ రేంజ్ కూడా మరింత పెరిగింది, అయితే ఆమె హౌజ్ నుంచి బయటకు వచ్చే క్రమంలో కొతెలుసో లేదో తెలియదు గాని ఫైనల్ రోజు సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు బిగ్ బాస్ ద్వారా మాట ఇచ్చిన విషయం తెలిసిందే.
నాగార్జున కూడా ఆమెకు మద్దతు ఇచ్చాడు. తప్పకుండా సహాయం చేస్తామని చెప్పడంతో కొన్ని రోజుల్లోనే ఇల్లు పని అయిపోతుందని అంతా అనుకున్నారు. కానీ ప్రస్తుతం గంగవ్వ చెబుతున్నదాన్ని బట్టి చుస్తే కొన్ని అనుమానాలు కలుగుతున్నాయి. ఇటీవల అభిజిత్ ఒక మీడియా ఛానెల్ లైవ్ లో ఉండగా గంగవ్వ అతనితో మాట్లాడింది. అయితే ఆ మాటల్లో ఇంటి విషయం గురించి కూడా ప్రస్తావించింది ఆమె. ఇల్లుకు దాదాపు 25 నుంచి 24లక్షల వరకు ఖర్చయ్యే అవకాశం ఉందని చెబుతూ బిగ్ బాస్ నుంచి అంతా డబ్బు వస్తుందా లేదా అన్న టెన్షన్ లో ఉన్నట్లు వివరణ ఇచ్చింది.
అయితే బిగ్ బాస్ నుంచి గంగవ్వకు పూర్తి మద్దతు అందలేదా అనే అనుమానాలు వస్తున్నాయి. షోలో నుంచి బయటకు వచ్చి నెలలు గడుస్తున్నా కూడా ఇంకా ఆమెకు పూర్తి సపోర్ట్ లభించలేదని ఆమె మాటలను వింటుంటే అర్ధమవుతోంది. మరి ఈ విషయం నాగార్జునకు తెలుసో తెలియదో గాని ఫైనల్ రోజు అయితే స్పెషల్ వీడియో వేసి మరి ఇల్లు ప్లాన్ సెట్టవుతోందని క్లారిటీ ఇచ్చారు. మరి బిగ్ బాస్ ఇచ్చిన మాటను ఎప్పుడు నిలబెట్టుకుంటారో చూడాలి..