Home News బిగ్ బాస్ 4: హారిక‌, అభిజీత్‌ల‌కు లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ పీకిన నాగ్.. బిగ్...

బిగ్ బాస్ 4: హారిక‌, అభిజీత్‌ల‌కు లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ పీకిన నాగ్.. బిగ్ బాస్ గేట్స్ ఓపెన్ చేయండి అంటూ..

బిగ్ బాస్ సీజన్ 4లో 12 వ వారం చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఈ రోజు శ‌నివారం కావ‌డంతో నాగ్‌తో ఇంటి స‌భ్యుల సంద‌డి కామ‌న్‌గా ఉంటుంది. అయితే వారంలో జ‌రిగిన త‌ప్పొప్పుల‌ని స‌రిచేస్తూ ఉండే నాగార్జున నేటి ఎపిసోడ్‌లో హారిక‌, అభిల‌కు లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ పీకి వారికి గ‌ట్టి బుద్ది చెప్పిన‌ట్టు తాజాగా విడుద‌లైన ప్రోమోని బ‌ట్టి తెలుస్తుంది. ల‌గ్జరీ బ‌డ్జెట్ టాస్క్‌లో భాగంగా బిగ్ బాస్.. మోనాల్‌ని ఏడిపించిన కార‌ణంగా ఆమెతో డేటింగ్ కు వెళ్ళాల‌ని చెప్పారు. కాని దానిని ప‌ర్స‌న‌ల్‌గా తీసుకున్న అభి.. టాస్క్ చేయ‌లేదు. దీంతో అఖిల్ డేటింగ్‌కు వెళ్ళాడు.

Abi Nag | Telugu Rajyam

మోనాల్ క‌ష్టంతో గెలిచిన హారిక ఈ విష‌యంలో అభిజీత్‌ని క‌నీసం హెచ్చ‌రించ‌లేదు, అంతేకాదు ఆయ‌న‌కు స‌ల‌హా కూడా ఇవ్వ‌లేదు. ఈ విష‌యంపై చ‌ర్చించేందుకు హారిక‌ని క‌న్ఫెష‌న్ రూంకి పిలిచిన నాగ్.. హారిక నువ్వు ఫర్ ది పీపుల్.. బై ది పీపుల్.. టు ది పీపుల్ కెప్టెన్ అయ్యానన్నావ్ కానీ మోనాల్ నిన్ను కెప్టెన్ చేస్తే.. అభిజీత్ కోసం నువ్వు అయ్యావ్ అంటూ మండిప‌డ్డారు. కెప్టెన్సీని ప‌ర్స‌న‌ల్ రిలేష‌న్స్ కోసం వాడుకుంటున్నావ్ అంటూ చుర‌క‌లంటించారు. ఇక అభిజీత్‌పై చాలా సీరియ‌స్ అయ్యాడు నాగ్.

టాస్క్ ఇచ్చిన‌ప్పుడు చేయ‌న‌న‌డం ఎంత పెద్ద త‌ప్పో తెలుసా అని నాగ్ అన‌డంతో మోనాల్‌ని ఏడిపించ‌డం అనే లైన్ నాకు న‌చ్చ‌లేదని అభీ చెప్పుకొచ్చాడు. దీంతో అభీకి సంబంధించిన వీడియోని ప్లే చేసి అంద‌రి ముందు అడ్డంగా బుక్ అయ్యేలా చేశాడు. దీంతో క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌క త‌ప్ప‌లేదు.ప్ర‌తి సారి త‌ప్పు చేస్తావు, క్ష‌మాప‌ణ‌లు కోర‌తావు. ఇది కరెక్ట్ కాదని అన్నాడు. త‌న త‌ప్పుని నాగ్‌పై నెట్టే ప్ర‌య‌త్నం చేయ‌డంతో ఇంకాస్త సీరియ‌స్ అయిన నాగార్జున .. బిగ్ బాస్ ఓపెన్ ది గేట్స్ ప్లీజ్ అంటూ గేట్స్ తెరిపించాడు. ప్రోమోతో షోపై బాగా ఆస‌క్తి క‌న‌బ‌రిచిన బిగ్ బాస్ ఎపిసోడ్‌తో ఇంకెంత రక్తి క‌ట్టిస్తారో చూడాలి.

- Advertisement -

Related Posts

అసలు పేరు అదే.. గుట్టు విప్పిన అషూ రెడ్డి

బిగ్ బాస్ షో ద్వారా అషూ రెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయింది. అంతకు ముందు డబ్ స్మాష్ అనే యాప్ ద్వారా వీడియోలు చేసి క్రేజ్ తెచ్చుకుంది. అలా...

నరాలు తెగే ఉత్కంఠ: నిమ్మగడ్డ, వైఎస్ జగన్.. గెలిచేదెవరు.?

గంటలు గడుస్తున్న కొద్దీ రాష్ట్రంలో చాలామందిలో నరాలు తెగే ఉత్కంట పెరిగిపోతోంది. వైసీపీ అధినేత, ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గెలుస్తారా.? రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్...

2021లో శృతి హాస‌న్ పెళ్లి.. ఈ ప్ర‌శ్న‌పై క‌మ‌ల్ గారాల ప‌ట్టి ఎలా స్పందించిందంటే!

గ‌త ఏడాది నుండి ఇండ‌స్ట్ర‌లో పెళ్ళిళ్ల హంగామా మ‌స్త్ న‌డుస్తుంది. రానా, నితిన్, నిఖిల్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్, నిహారిక‌, సుజీత్ , సునీత ఇలా ప‌లువురు సెల‌బ్రిటీలు త‌మ‌కు న‌చ్చిన వారితో ఏడ‌డుగులు...

Latest News