బిగ్ బాస్ సీజన్ 4 లో ఓ వైపు తన అందచందాలతో అలరించి మరోవైపు అఖిల్‌తో రొమాంటిక్‌గా ఉంటూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన గుజరాతీ ముద్దుగుమ్మ మోనాల్ గజ్జర్. సీజన్4లో తొలి కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన మోనాల్ మొదట్లో ప్రేక్షకులకి చాలా బోర్ తెప్పించింది. ప్రతి విషయానికి ఏడవడం, తెలుగులో మాట్లాడకపోవడం చేస్తుండడంతో ఆమెను తొందరగా పంపించేయాలని అనుకున్నారు. కాని ఎలాగోలా 14 వారాలు నెట్టుకొచ్చి భారీ సొమ్ముని పట్టుకొని పోయింది.
దాదాపు ప్రతి నామినేషన్లో ఉన్న మోనాల్ రాను రాను చాలా స్ట్రాంగ్‌గా మారింది. ఫిజికల్ టాస్క్లలోను అబ్బాయిలకి పోటి ఇచ్చింది. టాక్ 5లో ఉండలేకపోయాననే బాధతో బిగ్ బాస్ హౌజ్‌ను వీడిన ఈ అమ్మడు పలు ఆసక్తికర అంశాల గురించి వివరిస్తూ వార్తలలో నిలుస్తుంది. ఓ మలయాళ హీరోతో కొన్నాళ్ళ పాటు ప్రేమలో ఉన్నానని చెప్పిన మోనాల్ అతని వల్లనే ఎక్కువ సినిమాలు చేయలేకపోయానని అన్నది.అలానే తనకు సీజన్ 4లో కాదు రెండు, మూడు సీజన్స్ లోను కాల్ వచ్చిందట ఇప్పుడు వచ్చిందే కాదట గత రెండో సీజన్ అలాగే మూడో సీజన్ కు కాల్ వచ్చిందట.
రెండో సీజన్‌కు అనివార్య కారణాల వలన రావడం కుదరలేదని చెప్పిన మోనాల్, మూడో సీజన్‌కు కాల్ వచ్చినప్పుడు తాను యూఎస్‌లో ఉన్నట్టు పేర్కొంది. అందువలన ఆ సీజన్లో పార్టిసిపేట్ చేయడం కుదరలేదు. ఇక పెద్దగా తెలుగు రాని నేను బిగ్ బాస్ తెలుగు సీజన్స్ చూశాను. ఎలా మాట్లాడుకంటున్నారు అని పరిశీలించాను అని చెప్పుకొచ్చింది . రెండు సీజన్స్ సగంసగం చూసిన మోనాల్ మూడో సీజన్ మొత్తం చూసేసిందట. ఏదేమైన నాలుగో సీజన్లో హాట్ టాపిక్‌గా మారిన మోనాల్ బిగ్ బాస్ షోతో ఫుల్ ఫేమస్ అయింది.