BIGG BOSS 4 : ‘బాత్ రూమ్ లు కడిగే దరిద్రగొట్టు షో కి నేను వెళ్లను’

బుల్లితెర పాపులర్‌ రియాల్టీ షో బిగ్‌బాస్‌కు ఎంతటి క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హిందీలో సూపర్‌ డూపర్‌ హిట్‌ అయిన ఈ షో ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో తనదైన స్టైల్లో దూసుకపోతోంది. తెలుగు, తమిళ భాషల్లో ఇప్పటివరకు మూడు సీజన్లు పూర్తి చేసుకుంది బిగ్‌బాస్‌. తెలుగులో నాలుగో సీజన్‌ ఇప్పటికే ప్రారంభం కాగా తమిళంలో అక్టోబర్‌ 4 నుంచి ప్రారంభం కానుంది. అయితే తమిళంలో కమల్‌హాసన్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షోకు సంబంధించి కోలివుడ్‌ ట్యాలెంటెడ్‌ నటి లక్ష్మీ మీనన్‌ సంచలన వ్యాఖ్యలు చేసింది.

బిగ్‌బాస్‌ తమిళం సీజన్‌ 4లో లక్ష్మీ మీనన్‌ పాల్గొనబోతోందని అనేక వార్తలు వస్తున్న తరుణంలో ఆ వార్తలపై లక్ష్మీ మీనన్‌ స్పందించింది. ‘నేను బిగ్‌బాస్‌ షోలో పాల్గొనడం లేదు. ఇతరులు తిన్న ప్లేట్లు కడగడం, మరుగుదొడ్లు శుభ్రం చేయడం వంటి పనులు ఇంతవరకు చేయలేదు. రియాల్టీ షో పేరుతో కెమెరాల ముందు అతి చేయడం, ఫేక్‌గా ఉండటం, ఫైటింగ్‌ చేయడం వంటివి నాకు అస్సలు నచ్చదు. నాకు ఇలాంటి షోలు సెట్‌ అవ్వవు.

అందుకే బిగ్‌బాస్‌ షోలో పాల్గొనడం లేదనే విషయాన్ని స్పష్టంగా తెలుపుతున్నాను. బిగ్‌బాస్‌ వంటి రియాల్టీ షోలో నేను పాల్గొనడం లేదు, భవిష్యత్‌లో కూడా పాల్గొనను’ అంటూ లక్ష్మీమీనన్‌ స్పష్టం చేసింది. ప్రస్తుతం బిగ్‌బాస్‌ రియాల్టీ షోపై లక్ష్మీ మీనన్‌ చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.