బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్ నాడు ఎంత డ్రామా నడిచిందో అందరికీ తెలిసిందే. 25 లక్షలకు బేరం కుదుర్చుకుని బిగ్ బాస్ ఆట నుంచి సోహెల్ తప్పుకున్నాడు. అందులోనూ ఓ ఎమోషనల్ బ్లాక్ మెయిల్. ఆ 25 లక్షల్లో పది లక్షలు అనాథలకు ఇస్తానని చెప్పాడు. అదే బయటకు వచ్చాక మళ్లీ మాట మార్చాడు. ఆ పది లక్షల్లోంచి ఐదు లక్షలు మెహబూబ్‌కు ఇస్తానని చెప్పాడు. తనకు ఆ డబ్బేమీ వద్దు తనది కూడా అనాథలకే ఇవ్వమని మెహబూబ్ త్యాగం చేయడం, ఇక వీరిద్దరి ఫ్రెండ్‌షిప్‌కు కరిగిన నాగార్జున అనాథలకు ఇవ్వాలనుకున్న పదిలక్షలు తానే ఇస్తానని చెప్పిన సంగతి తెలిసిందే.
అలా మొత్తానికి నాగార్జున జేబుల్లోంచి పది లక్షలు బయటకు వచ్చాయి. వాటి గురించే ఇప్పుడు ఓ వార్త వచ్చింది. తాజాగా సోహెల్ తన చారిటీ పనులను మొదలుపెట్టేశాడు. అంటే నాగార్జున నుంచి పది లక్షలు వచ్చినట్టున్నాయి. ఈ మేరకు తాను ఇచ్చిన మాట ప్రకారం అనాథాశ్రమాలకు డబ్బును డొనేట్ చేస్తున్నాడ. ఈ మేరకు మీడియాతో అన్ని వివరాలను పంచుకున్నాడు. అంతే కాకుండా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ కూడా చేశాడు.
నా చేతుల్లోంచి అవసరమైన వారికి చారిటికీ డబ్బులు ఇవ్వాలన్న నా కల నెరవేరిన రోజు. ఇది నమ్మ లేకపోతోన్నాను. దేవుడికి థ్యాంక్స్. నా జీవిత కాలానికి సరిపడ ఆనందం ఇచ్చినందుకు నాగార్జున సర్‌కి పెద్ద థ్యాంక్స్.ఎంతో సంతోషంగా ఉంది.. అంతకు మించి సంతృప్తిగా ఉంది.. మనం కూడా ఓ మంచికారణం కోసం పది లక్షలు ఇవ్వగలిగినం.. ఇది నా జీవిత కాల కోరిక.. ఇప్పుడు తీరింది అంటూ సోహెల్ ఎమోషనల్ అయ్యాడు.