చిరంజీవికి కరోనా..షాక్‌లో బిగ్ బాస్ యాజ‌మాన్యం

క‌రోనా మ‌హ‌మ్మారి సినీప‌రిశ్ర‌మ‌పై ఎంత ప్ర‌భావం చూపించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ వైర‌స్‌తో దాదాపు ఏడు నెల‌లుగా షూటింగ్స్ అన్నీ స్తంభించాయి. థియేట‌ర్స్ మూత‌పడ్డాయి. అయితే ఇప్పుడిప్పుడే ధైర్యం చేస్తూ కొంద‌రు హీరోలు షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఆచార్య సినిమా షూటింగ్ మొద‌లు పెట్టేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఇందులో భాగంగా ఈ రోజు క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకుంటే అందులో పాజిటివ్ అని తేలింది. దీంతో టాలీవుడ్ ఉలిక్కిప‌డింది.

ఆచార్య షూటింగ్ ప్రారంభించాలని,కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. రిజల్ట్ పాజిటివ్. నాకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు.వెంటనే హోమ్ క్వారంటైన్ అయ్యాను.గత 4-5 రోజులుగా నన్ను కలిసినవారందరిని టెస్ట్ చేయించుకోవాలిసిందిగా కోరుతున్నాను.ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియచేస్తాను అని చిరంజీవి అన్నారు. అయితే శ‌నివారం నాగార్జున‌తో క‌లిసి ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సీఎంని క‌లిసారు. ఆ స‌మ‌యంలో తెలంగాణలో సినిమా పరిశ్రమ అభివృద్ధి- విస్తరణపై చర్చ జరిగింది.ఈ స‌మావేశంలో ఆర్ అండ్ బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్, రాజ్యసభ సభ్యుడు జె.సంతోష్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ ఉన్నారు.

కేసీఆర్ భేటి స‌మ‌యంలో చిరంజీవి, నాగార్జున అత్యంత స‌న్నిహితంగా మెలిగిన‌ట్టు తెలుస్తుంది. ఈ నేప‌థ్యంలో నాగార్జున‌కి కూడా క‌రోనా సోకి ఉంటుందా అనే అనుమానం వ్య‌క్తం అవుతుంది. ఒక‌వేళ నాగ్‌కి క‌రోనా సోకి ఉంటే బిగ్ బాస్ హోస్ట్ ఎవరు చేస్తార‌నే అనుమానాలు అంద‌రిలో మొద‌ల‌య్యాయి. ఇదిలా ఉంటే చిరంజీవిని క‌లిసిన త‌ర్వాతనే నాగార్జున ఆదివారం షోకి సంబంధించిన షూటింగ్‌లో పాల్గొన్నాడ‌ట‌. ఆ షోలో నాగార్జున‌.. అమ్మా రాజ‌శేఖ‌ర్‌ని కౌగిలించుకున్నాడు. యాంక‌ర్ సుమ‌తో క‌లిసి షో హోస్ట్ చేశాడు. మ‌రి ఆయ‌న నుండి వీరికి ఏమైన సోకే అవ‌కాశం ఉందా అంటూ నెటిజ‌న్స్ ఆలోచ‌న‌లు చేస్తున్నారు. ఏద‌మైన తెలుగు ప‌రిశ్ర‌మ‌కు పెద్ద దిక్కుగా ఉన్న చిరు క‌రోనా బారిన ప‌డ‌డం అంద‌రిలో ఆందోళ‌న క‌లిగిస్తుంది