బిగ్ బాస్ సీజన్ 4 నెవర్ బిఫోర్ అనేలా ఎంటర్టైన్మెంట్ తో ఈ సారి భాగానే ఎట్రాక్ట్ చేసింది. మధ్య మధ్యలో రేటింగ్ విషయంలో కాస్త పడుతూ లేచిన బిగ్ బాస్ మొత్తానికి చివరి దశలో మాత్రం మంచి రేటింగ్స్ తో టాప్ షోలలో ఒకటిగా నిలిచింది. ఇక ఆదివారం ప్రసరమైన ఫైనల్ షోకు మెగాస్టార్ రావడంతో మంచి క్రేజ్ దక్కింది. ఫైనల్స్ లో అఖిల్, అభి పోటీలో ఉండగా అభి గెలిచిన విషయం తెలిసిందే.
అసలు మ్యాటర్ లోకి వెళితే షోకు ఈ సారి ప్రచారాలు కూడా బాగానే చేసింది స్టార్ మా. ముఖ్యంగా అక్కినేని నాగార్జున తన హోస్ట్ బాధ్యతను చాలా బ్యాలెన్స్ గా మెయింటైన్ చేశారు. గొడవ పడాలి అని చెబుతూనే హద్దులు దాటకూడదు అంటూ హెచ్చరించారు కూడా. ఇక ఈ సారి బిగ్ బాస్ షోకు అందిన మొత్తం ఓట్లు 15కోట్ల 55లక్షలు. గత ఏడాదితో పోలిస్తే ఇది చాలా ఎక్కువ.
గత ఏడాది ప్రసారమైన బిగ్ బాస్ సిజన్ 3కి 8కోట్ల ఓట్లు మాత్రమే వచ్చాయి. అప్పుడు కూడా నాగార్జున హోస్ట్ చేయడంతో పాటు విన్నింగ్ ట్రోపిని మెగాస్టార్ చిరంజీవి అంధించారు. ఇక ఈ సారి వచ్చిన ఆదరణను చూస్తుంటే మళ్ళీ వచ్చే సీజన్ కు సైతం నాగార్జుననే హోస్ట్ గా ఫిక్స్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక వచ్చే ఏడాది సమ్మర్ అనంతరం మరో సీజన్ ను స్టార్ట్ చేయవచ్చని టాక్ వస్తోంది.