కరోనా కారణంగా ఎటు కదలకుండా ఇళ్లల్లోనే ఉండిపోయిన జనాలకి ఊపిరిపోస్తూ మొదలైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ఈ రోజుతో పూర్తి అయింది. నాగార్జున యాంకరింగ్,అందాల ముద్దుగుమ్మల నృత్య,గీతాలతో, ఫైనల్ ఎపిసోడ్ గ్రాండ్ గా జరిగింది.మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా విచ్చేసి అందరినీ అలరించారు. సెప్టెంబర్ 6 న సూర్య కిరణ్, మోనాల్ గజ్జర్, అబీజీత్ దుద్దాలా, లాస్యా మంజునాథ్, సుజాత, అరియానా గ్లోరీ, సయ్యద్ సోహెల్ ర్యాన్, అలెక్యా హరిక, దేవి నాగవల్లి, మెహబూబ్ షేఖ్, కమలే రాజశాలి సీన్, దివి వధ్య, అఖిల్ సార్థక్ మరియు గంగవ్వా పోటీదారులతో ఈ బిగ్ బాస్ సీజన్ మొదలైంది. చివరికి 105 రోజుల బిగ్ బాస్ సమరంలో విజేతగా అభిజీత్ నిలిచాడు.
అభిజిత్ గెలిచినట్లుగా నాగార్జున అతడి చేయి పైకెత్తాడు. చిరు, నాగ్ కలిసి అతడికి ట్రోఫీ అందించారు.బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ట్రోఫీ, ఒక బైక్ మరియు రూ .25 లక్షలు పొందాడు .ట్రోఫీ అందుకున్నాక అభిజిత్ సంతోషంలో మునిగి తేలాడు. తనకు ఓట్లేసిన ప్రేక్షకులకు పాదాభివందనాలు తెలిపారు. బిగ్‌బాస్ ఇంటికి మహానాయకుడినయ్యానని చెప్పారు. “తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ఇద్దరు పెద్ద తారలు నాగార్జున, చిరంజీవిలతో వేదికను పంచుకుంటారని నేను ఊహించలేదు. ప్రేక్షకుల ప్రేమకు నివాళి అర్పిస్తున్నాను” అని అబీజీత్ చెప్పారు.
ఇక రన్నరప్ గా 2వ స్థానంలో అఖిల్ నిలిచాడు. తనకు ఓటు వేసినందుకు మరియు టాప్ 2 లోకి తీసుకువచ్చినందుకు అఖిల్ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. “ఈ ప్రయాణం ఒక కల కన్నా ఎక్కువ అని . నాగార్జున సార్ మరియు చిరంజీవి సార్‌తో వేదికను పంచుకోవటం నమ్మలేకపోతున్నానని అందరికీ ధన్యవాదాలు” అని అఖిల్ చెప్పారు.