దూలతీరిందా అంటూ ఫైర్.. రోహిణి పరువుదీసిన అషూ

బిగ్ బాస్ షోలో స్నేహితుల్లా మారారు అషూ రెడ్డి, రోహిణి. మామూలుగా మూడో సీజన్ కంటెస్టెంట్లందరూ కూడా కలిసి ఉంటారు. శ్రీముఖి, బాబా భాస్కర్, మహేష్ విట్టా వంటివారు ఎక్కువగా అందరితో కలవరు. కానీ శివజ్యోతి, రోహిణి, అషూ, హిమజ, అలీ రెజా, శివ కృష్ణ, వితికా వంటి వారు ఎక్కువగా కలుస్తుంటారు. ఏ పార్టీలు జరిగినా కూడా అందరూ వస్తుంటారు. సరదాగా ఎంజాయ్ చేస్తుంటారు. అలా ఈ గ్యాంగ్ అంతా సోషల్ మీడియాలో చేసే రచ్చ వైరల్ అవుతుంటుంది.

అందులో మరీ ముఖ్యంగా రోహిణి, అషూ, శివజ్యోతి, హిమజలు రౌడీ గ్యాంగ్‌లా మారి తెగ హల్చల్ చేస్తుంటారు. శివజ్యోతి ఇంట్లో ఈ అందరూ కలిసి దుమ్ములేపుతుంటారు. అలా బిగ్ బాస్ కలిపిన బంధం ఇంకా నేటికీ కొనసాగుతూనే ఉంది. అషూ, రోహిణిలు ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నారు. జబర్దస్త్ స్టేజ్ మీదా ఇద్దరూ మెరుస్తున్నారు. అలా తాజాగా బయట మాల్ ఓపెనింగ్ ఉంటే వెళ్లినట్టు కనిపిస్తోంది.

Bigg Boss Fame Ashu Fires On Rohini
Bigg Boss fame Ashu Fires On Rohini

ఈ క్రమంలో కారులో ఉన్న రోహిణి కాలికి ఏదో చిక్కినట్టుంది. కారులోనే కూర్చున్న రోహిణి కాళ్లను సరి చేస్తూ అషూ బిజీగా ఉంది. అలా తన కాళ్లను అషూ పట్టుకున్న వీడియోను రోహిణి షేర్ చేసింది. తాను అలా కాళ్లు పట్టుకున్న వీడియోను తీయడంపై అషూ రియాక్ట్ అయింది. తాను వికలాంగులకు ఇలానే సాయం చేస్తానంటూ సెటైర్ వేస్తూ దూల తీరిందా అంటూ రోహిణికి కౌంటర్ వేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

https://www.instagram.com/stories/actressrohini/2466752327451647016/

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles