బిగ్ బాస్ హౌస్ లో అప్పుడే గోడవలు మొదలయ్యాయోచ్. ఇక ఎంటర్ టైన్ మెంట్ కు కొదవ లేదు. నిజానికి హౌస్ లో తొలి రోజే చిన్న గొడవ అయింది. ఆ తర్వాత రెండో రోజు కాస్త గొడవలు గట్రా ఏం లేవవు.. కానీ.. మూడో రోజు మాత్రం హౌస్ లో గొడవలు ఓ రేంజ్ లో ఉన్నాయి. దానికి కారణం కూడా లేకపోలేదు.
బిగ్ బాస్ సీక్రెట్ రూంలో ఉన్న అరియానా, సయ్యద్ కు ఓ టాస్క్ ఇచ్చాడు. వాళ్లిద్దరూ ఇక సీక్రెట్ రూంను వదిలి బిగ్ బాస్ హౌస్ కు వెళ్లి రచ్చ రచ్చ చేయాలని. నిజానికి సీక్రెట్ రూంలో ఉన్న అరియానా, సయ్యద్ కు మిగితా కంటెస్టెంట్లు ఫుడ్డు పంపించలేదు. దీంతో వాళ్లు కొంచెం అసహనానికి గురయ్యారు. అందులోనూ ఫుడ్డు కోసం ఫోన్ చేస్తే.. నోయల్ మాత్రం మధ్యలోనే ఫోన్ కట్ చేయడంతో మీరు డైరెక్ట్ గా వెళ్లి హౌస్ లోనే తేల్చుకోవాలంటూ బిగ్ బాస్ వాళ్లకు చెప్పడంతో అర్థరాత్రి వాళ్లు హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారు.
ఇక.. అప్పుడు స్టార్ట్ అవుతుంది అసలు గేమ్. హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగానే.. ఫుడ్డు గురించి మిగితా కంటెస్టెంట్లపై ఫైర్ అయ్యారు అరియానా, సయ్యద్. ఈ సమయంలోనే హౌస్ లో పెద్ద గొడవ జరిగింది. అరియానా, నోయల్ మధ్య ఓవైపు గొడవ జరగగా… సయ్యద్, అభిజిత్ మధ్య కూడా గొడవ జరిగింది.
ఒకానొక దశలో కొట్టుకునేవరకు కూడా అభిజిత్, సయ్యద్ వెళ్లారు. అరవకు.. అరవడం మాకు కూడా వచ్చు అంటూ అభిజిత్ పై సయ్యద్ కన్నెర్ర చేయగా.. మీరు ఇప్పుడే వచ్చి మమ్మల్ని అలా మాటలు అనడం కరెక్ట్ కాదు అంటూ అభిజిత్.. సయ్యద్ పై ఫైర్ అయ్యాడు.
ఒక్కటే ఒక పాయింట్ చెబుతా. నిన్న ఫుడ్డు వచ్చింది కాబట్టి.. నిన్నటి విషయం గురించి వాళ్లు మాట్లాడరు. ఇవాళ ఫుడ్డు రాలేదు కాబట్టి ఈరోజు గురించి వాళ్లు మాట్లాడుతున్నారు.. అంటూ నోయల్.. అరియానాపై ఫైర్ అవడంతో మిగితా కంటెస్టెంట్లు అందరూ చప్పట్లు కొట్టారు. అలా.. హౌస్ లో గొడవ కాస్త పెరిగి పెద్దదయింది.
దానికి సంబందించిన ప్రోమోను విడుదల చేశారు.