” 14 ” చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్

మెట్ల రాయల్ పిక్చర్స్ పతాకంపై లక్మీ శ్రీనివాస్ దర్శకత్వం లో, సుబ్బారావు రాయన మరియు శివకృష్ణ నిచ్చన సంయుక్తం గా నిర్మించిన చిత్రం 14. ఈ చిత్రం జులై 5న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది, ఈ సందర్భంగా చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను డైరెక్టర్స్ యూనియన్ ప్రెసిడెంట్ డైరెక్టర్ వీర శంకర్ లాంచ్ చేశారు.

ఈ సందర్భంగా వీరశంకర్ మాట్లాడుతూ అద్భుతమైనటువంటి స్క్రీన్ ప్లే తో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అయినటువంటి “14” చిత్రం కచ్చితంగా మంచి హిట్ కొడుతుంది. కొత్త కథతో ఈ సినిమా తెరకెక్కించడం చాలా ఆనందమని కొనియాడారు. రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం లో నోయల్, విషాక ధీమాన్ ప్రధాన పాత్రలు పోషించగా.. రతన్, పోసాని కృష్ణ మురళి,శ్రీకాంత్ అయ్యంగర్, రూపాలక్ష్మి తదితరులు నటించారు. ఈ చిత్రానికి కళ్యాన్ నాయక్ పాటలు అందించగా ఆదిత్య భార్గవ్ మాటలు రాశారు..