మొనాల్ గజ్జర్ కి బిగ్ బాస్ భారీ ఆఫర్.. నాగ్ బ్యానర్ లో హీరోయిన్ గా ఛాన్స్ ..?

బిగ్ బాస్ కి రాకముందు మోనాల్ గజ్జర్ గురించి అంతగా తెలియదనే చెప్పాలి. అయితే సినిమాల పరంగా ఎక్కడో విన్న పేరే అని కాస్త ఆలోచిస్తే మాత్రం అల్లరి నరేష్ నటించిన సుడిగాడు.. అలాగే వెన్నెల వన్ బై టు.. బ్రదర్ ఆఫ్ బొమ్మాళి సినిమాలు గుర్తుకు వస్తాయి. కాగా మోనాల్ సినిమాల పరంగా టాలీవుడ్ లో అంతగా పాపులర్ అవలేదు గాని.. నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ తో మాత్రం విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది.

ఇప్పుడు మోనాల్ కి బాగా ఫ్యాన్స్ కూడా ఏర్పడ్డారు. బిగ్ బాస్ స్టార్టింగ్ లో 3 లేదా 4 వారాలకి మించి ఉండదన్న కామెంట్స్ వినిపించాయి. ఆ తర్వాత నుంచి ప్రతీసారీ ఈ వారం ఎలిమేట్ అయ్యేది పక్కా మోనాల్ అంటూ సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతూ వస్తుంది. కాని మోనాల్ ఎప్పటికప్పుడు లక్కీగా సేవ్ అవుతూనే వచ్చింది. షో దాదాపు ఫైనల్ కి చేరుకుంది. కాని మోనాల్ మాత్రం బిగ్ బాస్ హౌజ్ లో కంటిన్యూ అవుతూనే అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. ప్రస్తుతం మోనాల్ టాప్ ప్లేస్ లో ఉందని అంటున్నారు.

మొత్తానికి బిగ్ బాస్ హౌజ్ లో గ్లామర్ ట్రీట్ ఇస్తూ టాప్ 5 లో నిలివడం గొప విషయమే అంటున్నారు. కాగా తాజా సమాచారం ప్రకారం మోనాల్ కి బిగ్ బాస్ నుంచి బయటకి రాగానే నాగార్జున బ్యానర్ లో సినిమా అవకాశం ఉందని అది కూడా హీరోయిన్ గా అన్న టాక్ వినిపిస్తోంది. మొనాల్ అంద చందాలతో ఇప్పుడు ప్రేక్షలను బాగా ఆకట్టుకుంది. అంతేకాదు విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా వచ్చేసింది. అందుకే ఒక సినిమాలో అవకాశం దక్కినట్టు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో అన్నది అఫీషియల్ న్యూస్ వస్తే క్లారిటి వస్తుంది. అయితే ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకి మోనాల్ హీరోయిన్ గా పరిచయమే కాబట్టి సినిమా ఛాన్స్ వచ్చినట్టే అంటున్నారు.