బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్‌కు ముందు అరియానా అంటే యాంకర్‌గా అతికొద్ది మందికే తెలుసు. ఆ తర్వాత అరియానాకు ఫాలోయింగ్ మామూలుగా లేదనే విషయం స్పష్టమైంది. బిగ్‌బాస్ ఇంటిలో అరియానాతో అవినాష్‌తో కెమిస్ట్రీ, ఆమె ఫైర్ బ్రాండ్ ఇమేజ్ విశేషంగా ఆకట్టుకొన్నాయి. బిగ్ బాస్ తెలుగు ‘సీజన్ 4’ కంటెస్టెంట్లు ఒకరి తర్వాత ఒకరు.. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. వెండితెరపై సందడి చేస్తున్నారు.
ఇప్పటికే గుజరాతీ భామ మోనాల్ గజ్జర్ టాలీవుడ్, బాలీవుడ్ మూవీస్‌లో చాన్స్‌లు కొట్టేసింది. తాజాగా అరియానా గ్లోరీని లక్కీ చాన్స్ వరించింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్టు ద్వారా యంగ్ హీరో రాజ్ తరుణ్‌తో కలిసి ఓ సినిమా చేస్తోందని అర్ధమే అవుతుంది. ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ దర్శకుడు శ్రీనివాస్ గవి రెడ్డి ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.
అయితే అరియానా..దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలపకుండా..బిగ్‌బాస్ తర్వాత తన జీవితంలో ఓ మంచి రోజని, అవకాశం ఇచ్చిన శ్రీనివాస్ గవిరెడ్డి గారికి థాంక్సని, రాజ్ తరుణ్ నువ్వు అమేజింగ్ అని… ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమం పూర్తయినట్లు ఫొటోను చూస్తుంటే తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ లో అరియానా హీరోయిన్ గా చేస్తుందా లేదా ముఖ్య పాత్రలో మెరవనుందా అన్న సందేహంలో ఆమె అభిమానులు ఉన్నారని సమాచారం. దీనిపై ఈ బ్యూటీ స్పందిస్తే ఆ ఊహాగానాలకు తెరపడుతుంది.