బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, షో నిర్వాహకులు ఈసారి గేమ్‌ను మరింత డిఫరెంట్ గా మార్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. గత సీజన్లలో ప్రేక్షకుల ఆసక్తిని నిలుపుకోవడంలో కొన్ని లోపాలు చోటుచేసుకోవడంతో, ఈసారి పూర్తిగా కొత్త తరహా మార్పులతో రాబోతున్నారు. ముఖ్యంగా, గత సీజన్లలో కొన్ని తరహా ఎంట్రీలపై వచ్చిన విమర్శల నేపథ్యంలో కంటెస్టెంట్ సెలెక్షన్‌లో కఠిన నిబంధనల్ని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇంతవరకు వచ్చిన బిగ్ బాస్ సీజన్లలో కొన్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, పాత కంటెస్టెంట్లను తిరిగి తీసుకొచ్చే విధానం, ప్రేక్షకులను నిరాశపరిచినట్లు అర్థమైంది. అందుకే, ఈసారి అలాంటి ఎంట్రీలను పూర్తిగా తొలగించి, ఫ్రెష్ కంటెస్టెంట్లతో షోను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు బిగ్ బాస్ టీమ్ ప్రయత్నిస్తోంది. పైగా, గత రెండు సీజన్లలో లవ్ ట్రాక్‌లు పెద్దగా ఆకట్టుకోకపోవడంతో, ఈసారి అవి సహజంగా జరిగేలా ప్లాన్ చేస్తున్నట్లు టాక్.
హోస్ట్ విషయానికి వస్తే, నాగార్జుననే కొనసాగించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గత రెండు సీజన్లలో కొన్ని విమర్శలు ఎదురైనా, ఆయన హోస్టింగ్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో మళ్లీ అదే ఫార్మాట్‌ను కొనసాగించబోతున్నట్లు సమాచారం. అయితే, నేరేషన్‌లో మార్పులు చేసి, షో ఫ్లోను మరింత న్యాచురల్‌గా, ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయట.
అంతేకాకుండా, గతంలో కామన్ మ్యాన్ ఎంట్రీలు హౌస్‌లో కొంతమంది సెలబ్రిటీలకు ఇబ్బంది కలిగించాయని భావిస్తూ, ఈసారి అలాంటి అవకాశం లేకుండా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మొత్తానికి, బిగ్ బాస్ 9 సీజన్ మరింత టఫ్‌గా, కొత్త రూల్స్‌తో ప్రేక్షకులను అలరించే విధంగా డిజైన్ అవుతుండటంతో, ఈసారి షో ఎంతవరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి.