బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో సీజన్ 4 విన్నర్‌గా అభిజిత్ జయకేతనం ఎగరవేయబోతున్నాడని చాలామంది విశ్వసిస్తున్నారు. అతడికి బయట కూడా ఓ రేంజ్ ఫాలోయంగ్ ఏర్పడింది. ఆర్మీలు ప్రచారం జోరు పెంచాయి. సీజన్ ఎండింగ్‌కి రావడంతో అతడికి ఓటింగ్ కూడా భారీగా పెరిగింది. అఖిల్ రేసులో ఉన్నా..అతడికి విన్నర్ అయ్యే అర్హత లేదని మెజారిటీ వీక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఇంత పాజిటివి ఉన్న సమయంలో అభి ఫ్యాన్స్ ఫేక్ ప్రచారం షురూ చేసి..అతడి ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నారు. ఈజీగా టైటిల్ గెలిచేవాడని లేనిపోని కష్టాల్లోకి నెడుతున్నారు.
గూగుల్ లో బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ ఎవరని అడిగితే అభిజిత్ పేరు వస్తున్నట్లు ఫేక్ ప్రచారం చేస్తున్నారు. బిగ్ బాస్ మరో ఐదువారాల్లో ముగియనుంది. ప్రస్తుతం హౌస్‌లో ఎనిమిది మంది కంటెస్టెంట్లు ఉన్నారు. మోనాల్, లాస్య అరియానా, హారిక, అభిజిత్, అవినాష్, అఖిల్, అరియానా, హారిక, సొహైల్ టైటిల్ రేస్‌లో సంక్రాంతి కోడిపుంజుల్లా పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో ఇలాంటి ప్రచారం అభి ఇమేజ్‌ను కచ్చితంగా దెబ్బతీస్తుంది అన్నది వాస్తవం.
అయితే ఇదంతా అభిని వ్యతిరేకించే వాళ్లు చేస్తోన్న ఫేక్ ప్రచారం అని అభి ఫ్యాన్స్ చెబుతున్నారు. ఇలాగే కొనసాగితే ఏదైనా జరగొచ్చు అనే చెప్పే బిగ్ బాస్..అఖిల్ ను విన్నర్ గా ప్రకటించినా ఆశ్చర్యపడక్కర్లేదు. బాగా ఆడుతున్నారు అనే వాళ్లకు మధ్యలోనే గుడ్ బై చెబుతున్నారు.. వీళ్లేం పెద్ద లెక్కలోకి రారు అనుకున్నవాళ్లు ఇంకా హౌస్‌లోనే ఉన్నారు. కాబట్టి అతి చేయకుండా అభి ఫ్యాన్స్ కంట్రోల్ లో ఉండటం అవసరం. తాజాగా అమ్మల ఎంట్రీతో బిగ్ బాస్ ఇంట్లో శత్రువులు అంతా మిత్రులుగా మారిపోయారు. మళ్లీ వారిని తిరిగి శత్రువులుగా మార్చేందుకు బిగ్ బాస్ నిర్వాహకులు స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారట. లెట్స్ వెయిట్ అండ్ సీ.