బిగ్ బాస్ 4: భుజాల‌పైన భారీ బ‌రువులు.. చివ‌రి వ‌ర‌కు నిలిచేదెవ‌రు?

బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్4లో పెద్దాయ‌న ఇస్తున్న టాస్క్‌లు ఎంతో ఆస‌క్తిక‌రంగా ఉంటున్నాయి. కొన్ని టాస్క్‌లు మెద‌డుతో ఆలోచించి ఆడాల్సి ఉండ‌గా, మ‌రికొన్ని భుజ బ‌లంతో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఫిజిక‌ల్ టాస్క్‌ల‌లో అమ్మాయిల‌తో పాటు అభిజీత్ కూడా పెద్ద ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వ‌క‌పోగా, సోహైల్, మెహ‌బూబ్, అఖిల్‌లు మాత్రం చెప్పుకోద‌గ్గ ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చారు. రోజులు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్ది హౌజ్‌మేట్స్ లో వాతావ‌ర‌ణం మారుతుంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌తి ఒక్క‌రు త‌మ గేమ్‌పై ఫుల్ ఫోక‌స్ పెడుతున్నారు.

ఈ వారం ఇంటి స‌భ్యుల ఫ్యామిలీస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌డంతో బిగ్ బాస్ హౌజ్ క‌ళ‌క‌ళలాడింది. కంటెస్టెంట్స్‌ల ముఖాల‌లో ఆనందం వెల్లివిరిసింది. ఇన్నాళ్ళ పాటు త‌మ కుటుంబానికి దూరంగా ఉన్న హౌజ్‌మేట్స్ త‌మ ఫ్యామిలీని చూసే స‌రికి ఆనంద బాష్పాలు త‌న్నుకుంటూ వ‌చ్చాయి. వారితో కొద్ది సేపు యోగ‌క్షేమాల గురించి చ‌ర్చించి త‌మ గేమ్ గురించి అడిగి తెలుసుకున్నారు. అంద‌రి ఇంటి స‌భ్యుల ఫ్యామిలీలు ఇంట్లోకి రాగా, లాస్య భ‌ర్త మంజునాథ్ ఈ రోజు హౌజ్‌లో సంద‌డి చేయ‌నున్నాడు.

ఇక ఈ వారం కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా బిగ్ బాస్ ఇంటి స‌భ్యుల‌కు ఓ టాస్క్ ఇచ్చారు. త‌మ భుజాల‌పైకి ఎవ‌రినైన ఎక్కించుకొని నిలుచోవ‌ల‌సి ఉంటుంది. ఎవ‌రైతే ఎక్కువ సేపు ఉంటారో వారు కెప్టెన్ బాధ్య‌తలు అందుకుంటారు. ఇందులో భాగంగా సోహైల్ .. అఖిల్‌ని త‌న భుజాల‌పైకి ఎక్కించుకోగా, అవినాష్‌- అభిజిత్‌, మోనాల్‌-హారిక‌ల‌ని మోసారు. చివ‌రి వ‌ర‌కు ఎవ‌రైతే బ‌రిలో ఉంటారో వారే కెప్టెన్ బ్యాండ్ వేసుకొనే అవ‌కాశం పొందుతారు. వ‌చ్చే వారం కెప్టెన్‌గా ఎవ‌రు నిలుస్తారో తెలుసుకోవాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.