బిగ్ బాస్ షోలో అరియానా రాను రాను అతికి అంబాసిడర్‌లా మారుతోంది. ఏది చేసినా సరే తన అతిని మాత్రం లోకానికి పరిచయం చేయాలనే తపన ఉన్నట్టు కనిపిస్తోంది. పుటేజ్ కోసమే చేస్తున్నా.. ఏదో ఒకటి చేస్తాను.. అది పాజిటివ్‌గా వెళ్లినా పర్లేదు.. నెగెటివ్‌గా వెళ్లినా పర్లేదు.. ఎలాగో ఒకలా గుర్తుండిపోతాను.. ఫేమస్ అవుతాను కదా అని మొదట్లోనే ఈ బోల్డ్ పాప భీరాలు పలికింది.
చెప్పినట్టే అలాగే చేసింది. ప్రతీ దాంట్లో అతి ప్రదర్శించడంతో అరియానా కాస్తా అతియానా అయిపోయింది. ఇక నిన్నటి ఎపిసోడ్‌లోనూ అరియానా తన నటనా కౌశలాన్ని ప్రదర్శించింది. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పి ఇంటి నుంచి పంపించింది అరియానా. మీరు తీసుకున్న నిర్ణయం తప్పు అని ఇంటి సభ్యులను ఏకిపారేశాక అరియానా తన స్వరం మార్చేసింది. అఖిల్‌ను పంపించొద్దని అందరూ వేడుకున్నారు.
బిగ్ బాస్ న్యాయంగా లేడు.. ఇది మంచి పని కాదంటూ గునడం ప్రారంభింది. అరియానా నీ పాయింట్ ఏంటో చెప్పు అని నాగార్జున అనడంతో మరోసారి తన అతిని ప్రదర్శించింది. బిగ్ బాస్ నిర్ణయాలు నాకు నచ్చడం లేదు.. అవును మేం తప్పుచేశాం కానీ అఖిల్‌ను పంపించకండి. ఈ నిర్ణయం తప్పు అని నాటకాలు ఆడింది. చివరకు అఖిల్‌ది ఫేక్ ఎలిమినేషన్ అని తెలిశాక మళ్లీ మహానటి లెవెల్‌లో జీవించేసింది.