రాహుల్ సిప్లిగంజ్ ప్రతీ వారం ఎలిమినేట్ అయిన సభ్యులను ఇంటర్వ్యూ చేస్తాడు. ఇంటర్వ్యూల అనంతరం ఓ పోస్ట్ పెడుతుంటాడు. ప్రతీ శనివారం రాత్రి ఓ పోస్ట్ పెడుతుంటాడు. ఈ వారం గెస్ట్‌తో ఇంటర్వ్యూ పూర్తి అయిందని సెట్‌లో దిగిన ఫోటోను షేర్ చేస్తాడు. ఇలాగే గత వారంలో దివి ఎలిమినేట్ అయిన సందర్భంలో ఇంటర్వ్యూ పూర్తయిందని ఓ పోస్ట్ పెట్టాడు. రాహుల్ పెట్టిన పోస్ట్ ఆధారంగా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఎవరన్నది అధికారికంగా తెలిసిపోయినట్టైంది.
రాహుల్ సిప్లిగంజ్ ఏడో వారంలో దివి ఎలిమినేట్ అయిన సందర్భంలో ఓ ఫోటోను షేర్ చేశాడు. ఆ ఫోటో బ్యాక్ గ్రౌండ్‌లో దివి ఎలిమినేట్ అయినట్టు కనిపించింది. ఎలిమినేట్ అయిన సభ్యుల ఫోటోలు ఓ ఫ్రేమ్‌లు పెట్టి ఓ ట్యాగ్ ఇస్తాడు కదా. సరిగ్గా ఆ ఫ్రేమ్ కనపడేలా.. పోజు ఇచ్చి ఫోటోను దిగాడు. దీంతో సోషల్ మీడియా, మీడియా దాన్ని కని పెట్టేసింది. ఎలిమినేషన్‌ను ముందే లీక్ చేసిన రాహుల్ సిప్లిగంజ్ అంటూ వార్తలు రాసేశారు.
అలా వార్తలు వైరల్ అవ్వడంతో బిగ్ బాస్ టీం హెచ్చరించినట్టుంది. రాహుల్ సిప్లిగంజ్‌కు గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టున్నారు. అందుకే ఈ సారి మాత్రం పోజిషన్‌ను మార్చాడు. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ల ఫోటోలు లీక్ కాకుండా.. అవతలి సైడ్ కూర్చుని పోజిచ్చాడు., మొత్తానికి తప్పు తెలుకున్నావ్.. ముందే తెలిసిపోతోందని భయపడ్డాడు అందుకే పొజిషన్ మార్చాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయినా రాహుల్ చెప్పకపోయినా ఎలిమినేట్ కానుంది ఎవరన్నది లీకవుతూనే ఉంటుంది. ఈ వారంలో అమ్మ రాజశేఖర్ ఇంటి నుంచి బయటకు వెళ్లనున్నాడని లీకులు వచ్చేశాయి.