బిగ్ బాస్ షో హిస్టరీలోనే అతికి అవార్డు ఇవ్వాలంటే అన్ని సీజన్లలోని కంటెస్టెంట్లందరిలోనూ అరియానా ముందుంటుంది. ఆ అవార్డు కోసేమే పుట్టినట్టుగా అరియానా ప్రవర్తిస్తుంది. ఇప్పటికే నెటిజన్ల చేత అతియానా అని పేరు పెట్టించుకుంది. ఆమె చెప్పే మాటలు గొప్పగా ఉంటాయి.. చేసే చేష్టలు మాత్రం చెత్తగా ఉంటాయి. స్పీచ్‌లు, మంచి మాటలు చెప్పమంటే ముందుంటుంది. కానీ ఆచరణలో మాత్రం చివర్లో ఉంటుంది.
శనివారం నాటి ఎపిసోడ్‌లో అరియానాకు నాగార్జున అదిరిపోయే పంచ్ ఇచ్చాడు. మొహం జాగ్రత్త అనే టాస్కులో నామినేట్ అయిన సభ్యులు ఇమ్యూనిటీ కోసం చాలానే కష్టపడుతున్నారు. వారంతా టీ స్టాండ్‌పై మొహాన్ని పెట్టి నిల్చున్నారు. వారిని కదిల్చేందుకు మిగతా కంటెస్టెంట్లు ప్రయత్నించాలని తెలిపాడు. అందుకోసం కొన్నింటిని బిగ్ బాస్ పంపించాడు. గడ్డి, ఇసుక, నీళ్లు, ఐస్ క్యూబ్స్ వంటివాటిని పంపించాడు. వీటి సాయంతో వారిని డిస్టర్స్ చేయాలని తెలిపాడు.
అందరూ ఓ పద్దతిగానే ఆడుతున్నారు. కానీ అరియానా మాత్రం ఐస్ క్యూబ్స్‌తో మొహం మీద కొట్టేసింది. ఐస్ క్యూబ్స్ వారి మొహాలకు, కంటికి తాకాయి. ఐస్ వాటర్, క్యూబ్స్ వద్దని సోహెల్ వారించాడు. నీళ్లు పోస్తూనే ఉండటంతో సోహెల్ వాటిని విసిరి అవతలపారేశాడు. ఇదే విషయాన్ని నాగార్జున ప్రస్థావించాడు. కొంచెం మానవత్వం కూడా చూపించాలి.. అక్కడ కంటెస్టెంట్లకు ఆరోగ్యాలు అసలే బాగాలేవు.. అలాంటి ఐస్ వాటర్, క్యూబ్స్‌తో మొహం మీద కొట్టడం అవసరమా? అని సోహెల్ ప్రశ్నించాడు. ఆ ఐస్ వాటర్, క్యూబ్స్ నేను తీసుకురాలేదు.. బిగ్ బాస్ ఇచ్చాడు.. నేను టాస్క్ ఆడాను అని ఏదో పెద్ద ఘనకార్యం చేశాను అని అరియానా చెప్పుకుంది. బిగ్ బాస్ పూలు పంపుతాడు.. కత్తి పంపుతాడు.. ఏది వాడాలో మనం నిర్ణయించుకోవాలంటూ అరియానాకు చెప్పుతో కొట్టినట్టు చెప్పాడు. నాగార్జున అలా అనడంతో ఇంటి సభ్యులందరూ చప్పట్లు కొట్టారు.