బిగ్ బాస్4: సోహెల్ అలా చిక్కాడు.. ఆడుకుంటోన్న అరియానా

Bigg Boss 4 Telugu week 14 Sohel Ariyana Issue

బిగ్ బాస్ షోలో పద్నాలుగో వారం చిత్రవిచిత్రంగా మలుపులు తిరుగుతోంది. ఈ వారం మొత్తం అరియానా చుట్టే తిరిగింది. అరియానా సోహెల్ గొడవ మామూలుగా వైరల్ అవ్వలేదు. అరియానా సోహెల్ అరుచుకున్న విధానం ఒకరిపై ఒకరు పైపైకి వెళ్లిన విధానం, సోహెల్ మాటలకు బీప్‌లు వేయడం ఇలా గొడవ తారాస్థాయికి వెళ్లింది. అక్కడి వరకు అంతా భాగానే ఉంది. సోహెల్‌ను అఖిల్ అభిజిత్ అదుపు చేశారు. గొడవ అంతా ముగిసిందని అనుకున్న తరువాత అరియానా ఏడుపు ప్రారంభించింది. అభిజిత్ వచ్చి ఓదార్చుతుంటే కింద పడి బొర్లి మరీ ఏడ్చేసింది.

Bigg Boss 4 Telugu week 14 Sohel Ariyana Issue
Bigg Boss 4 Telugu week 14 Sohel Ariyana Issue

ఓ అబ్బాయి తన మీదకు అలా రావడం జీర్ణించుకోలేకపోతోన్నా అని అరియానా ఏడ్చేసింది. కానీ తాను మీద మీదకు వెళ్లింది, అరిచింది మాత్రం గుర్తుంచుకోలేకపోతోంది. అఖిల్ ఈ విషయంలో నిజం మాట్లాడాతే అరియానా నొచ్చుకుంది. ఎవ్వరూ ఈ విషయంలో మాట్లాడకండని వాదించింది. అదంతా బాగానే ఉంది. మళ్లీ సోహెల్ అరియానాతో మాట్లాడి ఈ గొడవను అక్కడితో సద్దుమణిగేలా చేద్దామని చూసినా వర్కవుట్ కాలేదు. నిన్నటి ఎపిసోడ్‌లో కథ మళ్లీ మొదటికి వచ్చింది.

అరియానాతో మాట్లాడుదామని సోహెల్ బుజ్జగించి పట్టుకొస్తుంటే.. మాట వినలేదు. తాకొద్దు, ముట్టొద్దు దూరంగా ఉండు అన్నట్టుగా అరియానా ప్రవర్తించింది. ఇక తన మీదకు అలా రావడం మాత్రం తీసుకోలేకపోతోన్నా అంటూ అరియానా మళ్లీ అదే పాట పాడింది. అందులో ఇద్దరి తప్పు ఉంది.. నువ్ మీద మీదకు వచ్చావ్.. నేను కూడా వచ్చాను అంటూ సోహెల్ చెప్పుకొచ్చాడు. నిజానికి సోహెల్ చెప్పిన దాంట్లో నిజమున్న కానీ ఎవ్వరూ పట్టించుకోరు. ఇప్పుడు తప్పంతా సోహెల్‌ది అన్నట్టు మారింది. అమ్మాయి మీద అలా వెళ్లడం తప్పంటూ వీకెండ్‌లో నాగార్జున సోహెల్‌కు ఎలాగూ క్లాస్ పీకుతాడు. పాపం సోహెల్ విన్నరో, రన్నరో కావాల్సిన వాడు.. అరియానా టార్గెట్ చేస్తోన్న విధానానికి దెబ్బకు మూడో స్థానానికి పడిపోయే అవకాశం ఉంది.