బిగ్ బాస్4: ఘాడంగా హత్తుకుని ముద్దు పెట్టింది.. అరియానా చేసిన పనికి సోహెల్ షాక్!!

Bigg Boss 4 Telugu week 13 Ariyana kisses Sohel

బిగ్ బాస్ షోలో ఎప్పుడు ఎవరు ఎలా ప్రవర్తిస్తారో చెప్పడం కష్టం. అప్పుడే కలిసిపోతారు.. అప్పుడు విడిపోతారు. ఈ విషయంలో అరియానా సోహెల్ మాత్రం ముందుంటారు. ఈ నాల్గో సీజన్ మొత్తంలో మొదటగా క్లోజ్ అయిన కంటెస్టెంట్లు వాళ్లే. నైబర్ రూంలో ఈ ఇద్దరూ రెండ్రోజులకే బాగా క్లోజ్ అయ్యారు. అయితే చివరి వరకు వీరి స్నేహం అలాగే ఉంటుందని, ఓ లవ్ ట్రాక్ క్రియేట్ చేద్దామని బిగ్ బాస్ ప్రయత్నించినట్టున్నాడు. కానీ ఈ ఇద్దరూ మాత్రం విడిపోయారు. ఒకరంటే ఒకరికి పడనట్టుగా తయారయ్యారు.

Bigg Boss 4 Telugu week 13 Ariyana kisses Sohel
Bigg Boss 4 Telugu week 13 Ariyana kisses Sohel

అప్పుడే కలిసిపోతారు.. అప్పుడే కొట్టుకుంటారు.. ఒకరిపై ఒకరు పై చేయి సాధించాలని ప్రయత్నిస్తుంటారు. అరియానా యాటిట్యూడ్, బిహేవియర్ తనకు నచ్చదని సోహెల్ చెప్పడం, సోహెల్ తనతో మాట్లాడే పద్దతి నచ్చని అరియానా ఫిర్యాదు చేస్తూ వస్తోంది. ఇలా ప్రతీవారంలో గొడవలు పడుతూనే ఉంటారు. నామినేట్ చేసుకుంటూనే వస్తున్నారు. అయితే నిన్నటి ఎపిసోడ్‌లో అరియానాకు ఏమైందో ఏమో గానీ ఎవ్వరూ ఊహించని పని చేసింది.

సోహెల్ అరియానా కిచెన్ రూంలో ఉండగా.. అరియానా వచ్చింది సోహెల్‌ను గాఢంగా హత్తుకుంది. బుగ్గపై ముద్దు పెట్టేసింది. సారీ రా.. నువ్వంటే నాకు ఎప్పుడూ ఇష్టమేరా.. కానీ మన మధ్య ఎప్పుడూ ఏదో ఒక గొడవ వస్తూనే ఉంటుందని అరియానా ఎమోషనల్ అయింది. అరియానా వచ్చి హత్తుకోవడం, ముద్దు పెట్టుకోవడంతో సోహెల్ కూడా ఎమోషనల్ అయ్యాడు. కానీ తీరా చూస్తే మళ్లీ నామినేషన్‌లో సోహెల్‌ను అరియానా నామినేట్ చేయడంతో షాక్ అయ్యాడు.