బిగ్ బాస్4: గెస్ట్‌గా వచ్చాడు మనసు దోచాడు.. నాగ్ కంటే సుదీప్ బెటర్!

Bigg Boss 4 Telugu week 12 Netizens Praises Kiccha Sudeep Than Nagarjuna

కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ నిన్న బిగ్ బాస్ స్టేజ్ మీద అల్లాడించాడు. ఉన్నది పది నిమిషాలే గానీ అదరగొట్టేశాడు. సుదీప్ ఎంట్రీతోనే నాగార్జున ఓ మాట అనేశాడు. నటుడిగా నేను సీనియర్ ఏమో గానీ బిగ్ బాస్ హోస్ట్‌గా మాత్రం నువ్వే నాకు సీనియర్‌వి అని సుదీప్‌తో నాగార్జున అనేశాడు. అది మాత్రం నిజం. ఎందుకంటే కన్నడలో ఏడు సీజన్లలో బిగ్ బాస్ హోస్ట్‌గా అదరగొట్టేశాడు. దేశంలో సల్మాన్ ఖాన్ తరువాత సక్సెస్‌ఫుల్ హోస్ట్‌గా సుదీప్ లిస్ట్‌లోకి ఎక్కాడు.

Bigg Boss 4 Telugu week 12 Netizens Praises Kiccha Sudeep Than Nagarjuna
Bigg Boss 4 Telugu week 12 Netizens Praises Kiccha Sudeep Than Nagarjuna

అసలు సుదీప్ హోస్ట్ ఎలా చేస్తాడా? అని అనుమానం ఉన్న తెలుగు ప్రేక్షకులకు నిన్నటి పటా పంచలు అయిపోయాయి. కంటెస్టెంట్లను ఎలా కమాండ్ చేయాలి.. వారు సోది చెబుతుంటే ఎలా ఆపాలి.. ఎలా సమయస్ఫూర్తితో మెలగాలి అనే సుదీప్ దగ్గర నేర్చుకోవాల్సిందే. సుదీప్ బిగ్ బాస్ తెలుగు స్టేజ్ మీద ఉన్న పది నిమిషాల్లో ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాడు. ఇక నెటిజన్లైతే సుదీప్ నెత్తిన పెట్టేసుకుంటున్నారు.

హోస్టింగ్ ఎలా చేయాలో నాగార్జున సుదీప్ దగ్గర నేర్చుకుంటే బెటర్ అని, ఇక ఇప్పటి నుంచి సుదీప్ కోసం కన్నడ బిగ్ బాస్ చూస్తానని నెటిజన్లు కామెంట్ల మీద కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి దసరా నాడు సమంత వచ్చి నాగార్జున హోస్టింగ్‌ను తుస్సుమనిపించింది. నిన్న సుదీప్ వచ్చి నాగార్జున హోస్టింగ్ గాలి తీసేశాడు. గత సీజన్‌లో రమ్యకృష్ణకు కూడా అంతే పేరు వచ్చింది. ఇలా హోస్ట్‌గా నాగార్జునపై ఎప్పటికప్పుడు నెగెటివ్ టాక్ వస్తూనే ఉంది.