నేను చాలా గలీజ్ దాన్ని.. హారిక కామెంట్స్ వైరల్

Bigg Boss 4 Telugu week 11 nominations Sohel And Harika On Fire

బిగ్ బాస్ షోలో పదకొండో వారం నామినేషన్స్ ప్రక్రియ ఎంత రచ్చగా మారిందో అందరికీ తెలిసిందే. సోహెల్ హారిక మధ్య జరిగిన సంభాషణలో ఒకరి ఇమేజ్ ఘోరంగా పడిపోతే.. మరొకరి ఇమేజ్ ఎక్కడికో పెరిగింది. అమ్మాయిపై బాడీ షేమింగ్ చేస్తూ కనీసం గౌరవం అంటూ ఇవ్వకుండా ఇష్టమొచ్చినట్టుగా మాటలు మాట్లాడిన సోహెల్ పరిస్థితి దారుణంగా పడిపోయింది. ఆ కోపంలో ఏం మాట్లాడాడో కూడా మరిచిపోయినట్టున్నాడు. అఖిల్ పంచన చేరడంతోనే సోహెల్ ఇలా మాట్లాడుతున్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Bigg Boss 4 Telugu week 11 nominations Sohel And Harika On Fire
Bigg Boss 4 Telugu week 11 nominations Sohel And Harika On Fire

సోహెల్ హద్దులు దాటి మాట్లాడిన మాటలకు హారిక కూడా ధైర్యంగా నిలబడి, అంతే స్థాయిలో సోహెల్‌కు సమాధానం చెప్పిన గట్స్‌కు అందరూ ఫిదా అవుతున్నారు. సోహెల్ ఎంత వాయిస్ పెంచుతూ ఉంటే.. హారిక కూడా అంతే స్థాయిలో పోరాడింది. ఒకానొక దశలో హారిక హైట్ గురించి సోహెల్ మాట్లాడిన మాటలు ఇమేజ్‌ను డ్యామేజ్ చేశాయి. గింతంత లేవు మాట్లాడుతున్నవ అంటూ ఘోరంగా మాట్లాడాడు. అయితే హారికకు కాలాలి అని కావాలనే అన్నాను అంటూ తరువాత అరియానా దగ్గర కవర్ చేశాడు.

కానీ సోహెల్‌కు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయితే నామినేషన్స్ ప్రక్రియలో మాస్ ఊర మాస్.. ఊరకే ఊర మాస్ అంటూ సోహెల్ హారికలు ఒకరిపై ఒకరు పై చేయి సాధించాలని చూశారు. మధ్యలో హారిక గురించి మాట్లాడుతూ సోహెలో నోరు జారాడు. నీకు అన్ని ముందే తెలుసు.. ఎవరిని ఎలా ఉంచాలి.. ఎవరితో మాట్లాడాలి.. ఎవరితో డ్యాన్సులు చేయాలి.. అన్నీ ఇలా ముందే డిసైడ్ అవుతావ్ నీ గురించి నాకు తెలీదా అని నోరు జారాడు. నేను ఎప్పుడూ అలా అనుకోలేదు.. బిగ్ బాస్ ఇచ్చిన పార్ట్నర్‌తోనే డ్యాన్స్ చేశాను.. మరీ ఆ రోజు సినిమాలో నీతో డ్యాన్స్ చేశాను కదా అని హారిక అనేసరికి సోహెల్ యూట్నర్ తీసుకున్నాడు. ఆ ఒక్కటి కాద.. మిగతావి అన్ని అంటూ మాటమార్చాడు.

నామినేషన్స్ అయిన తరువాత హారిక ఇంకా కోపంతోనే ఉన్నట్టు కనిపించింది. లాస్యతో మాట్లాడుతూ తన ఫ్రస్ట్రేషన్‌ను తీర్చుకుంది. మాస్ ఊర మాస్ అంటూ ఎవడు బయపడతాడు.. ఆయన కింద ఏం పని చేయడం లేదు.. నేను ఇంకా చాలా గలీజ్ దాన్ని అంటూ సోహెల్ మీద పట్టరాని కోపంతో హారిక ఉన్నట్టుంది.