కింగ్ నాగార్జున బిగ్ బాస్ హోస్ట్‌గా శనివారం నాటి ఎపిసోడ్‌లో ఇన్నాళ్లకు అదరగొట్టేశాడు. ప్రతీ ఒక్కరికీ పంచ్‌లు, సెటైర్లు, ఓదార్పు మాటలు ఇలా కరెక్ట్‌గా ఎక్కడ వాడాలో అక్కడ వాడేశారు. చాలా మందికి చాలా కౌంటర్లు వేశాడు. శనివారం నాటి ఎపిసోడ్‌లో ఫ్యామిలీ మెంబర్స్‌ను తీసుకొచ్చి.. ఓ ఆట ఆడించాడు. ఈ వారం మొత్తం ఫ్యామిలీ టచ్ ఇవ్వడమే సరిపోయింది.. అయితే కుటుంబ సభ్యులతో ఓ ఆట ఆడించడంతో అందరికీ కొన్ని విషయాలపై క్లారిటీ వచ్చింది.
అందులో మరీ ముఖ్యంగా లాస్య, అరియానా ఫ్యామిలీకి కౌంటర్ల మీద కౌంటర్లు పడ్డాయి. లాస్య తన తల్లి రాగానే కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. కాస్త ఎమోషనల్ అయింది. అయితే ఆమె తల్లి మాత్రం స్టేజ్ మీద నవ్వుతూనే ఉంది. మీ కూతురు మీకు ఎన్ని షాకులు ఇచ్చింది అని నాగార్జున అనడంతో ఆమె నవ్వేసింది. అలాంటిదేమీ లేదని నవ్వుతూనే చెప్పింది. నువ్ నవ్వుతున్నావ్ కానీ లోపల వేరే ఉందిలే కనిపిస్తోందని లాస్య అనడంతో.. నీ గురించి అలానే అనుకుంటున్నారులే అని నాగార్జున దిమ్మ తిరిగే పంచ్ వేశాడు.
ఇంట్లోకి వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్‌తో టాప్ 5 కంటెస్టెంట్స్ చెప్పమని ఓ ఆట ఆడించాడు. అందులో భాగంగా అరియానా ఫ్యామిలీ అఖిల్‌ను టాప్ ప్లేస్‌లో పెట్టారు. అయితే అఖిల్‌ను టాప్ పొజిషనల్‌లో ఎందుకు పెడుతున్నామనే విషయాన్ని చెబుతూ ఓ కారణం చెప్పారు. అఖిల్ సింగిల్‌గా ఆడతాడు అని అరియానా ఫ్రెండ్ అంటే.. సింగిల్‌గా కాదు సోహెల్‌తో ఆడతాడు అని అదిరిపోయే పంచ్ వేశాడు. అలా నిన్నటి ఎపిసోడ్‌లో నాగార్జున దుమ్ములేపేశాడు.