బిగ్ బాస్4: టాప్ 2లో ఉండేది వాళ్లే.. జనాల నాడి పట్టేసిన లాస్య!!

Bigg Boss 4 Telugu Week 11 Lasya About Abhijeet And Sohel

బిగ్ బాస్ షోలో లోపల ఉన్న కంటెస్టెంట్లు ఒక్కోసారి ఊహించినవి నిజమవుతుంటాయి. వారి అంచనాలు బయట జనాల అంచనాలు ఒకేలా ఉంటాయి. జనాల నాడిని లోపల ఉన్న కంటెస్టెంట్లు పసిగడుతుంటారు. నిన్న లాస్య కూడా అలానే చేసినట్టుంది. టాప్ 2లో ఎవరుంటారని లాస్యను నాగార్జున అడిగాడు. దానికి లాస్య వెంటనే అభిజిత్ సోహెల్ ఉంటాడని చెప్పింది. అయితే లాస్య ఏ విషయాలను బేరీజు వేసుకుని చెప్పిందో గానీ జనాల పల్స్ పట్టేసింది.

Bigg Boss 4 Telugu Week 11 Lasya About Abhijeet And Sohel
Bigg Boss 4 Telugu Week 11 Lasya About Abhijeet And Sohel

ఇంట్లోకి వచ్చిన ఫ్యామిలీమెంబర్స్, స్టేజ్ మీదకు వచ్చిన వారంతా మాట్లాడిన తీరును బట్టి ఈ నిర్ణయానికి వచ్చి ఉండొచ్చు. స్టేజ్ మీదకు వచ్చిన కుటుంబ సభ్యులందరూ సోహెల్‌ను టాప్ 5లో చెప్పడం, అందరూ అభిజిత్ గురించి గొప్పగా మాట్లాడటంతో టాప్ 2లో ఊహించుకుందేమో. ఏది ఏమైనా లాస్య మాత్రం ఈ విషయంలో సరిగ్గా చెప్పింది. ఎందుకంటే ప్రస్తుతం ట్రెండ్ మాత్రం అలాగే ఉంది. ఇక షో ఎన్ని వారాలుందని ఎవ్వరూ చూడటం లేదు.

వార్ మీ మధ్యా మా మధ్యా అన్నది చూస్తున్నారు ఫ్యాన్స్. అటు అభిజిత్ ఫ్యాన్స్ ఇటు సోహెల్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ట్వీట్ల యుద్దాన్ని ప్రకటిస్తూ ట్విట్టర్‌‌లో ట్రెండింగ్ చేస్తున్నారు. అయితే ఈ ఇద్దరి మధ్యలోనూ విన్ అయ్యే అవకాశం మాత్రం అభిజిత్‌కు ఉందని తెలుస్తోంది. ఈ నాల్గో సీజన్ టైటిల్‌ను ఎవరు గెలుస్తారో చూడాలి.