బిగ్ బాస్ ఇంట్లో ఎప్పుడు ఎవరు ఎలాంటి మాటలు వదులుతారో ఎవ్వరికీ తెలీదు. కొందరు ఉద్దేశ్యపూర్వకంగా మాటలు అనేస్తారు. ఇంకొందరు కామెడీగానే అన్నా అది సీరియస్ అవుతుంది. మరికొందరు టాస్కులో భాగంగా కొన్ని మాటలు అంటారు. అవి ఎంతో దూరాన్ని పెంచుతుంటాయి. తాజాగా నిన్న నాగార్జున ఇచ్చిన ఓ టాస్కు సోహెల్ పరువు తీసేసింది. అందరి మనసులో సోహెల్ పట్ల ఉన్న అభిప్రాయం బయటకు వచ్చింది. ఇంతకీ ఆ ఆట ఏంటో, ఆ కథ ఏంటో చూద్దాం.
దీపావళి సందర్భంగా నాగార్జున ఇంటిసభ్యులతో ఓ ఆట ఆడించాడు. చిచ్చుబుడ్డి, ఆటంబాంబులతో ఇంటి సభ్యులను పోల్చాలని నాగార్జున తెలిపాడు. చిచ్చుబుడ్డి అంతే అంత ఎత్తునే లేస్తారు.. ఏదో చేస్తారని అనుకుంటాం కానీ చివరకు ఏం చేయరు తుస్సుమంటారు. ఆటంబాంబ్ అంటే సైలెంట్‌గా ఉంటారు..టైం వచ్చినప్పుడు పేలిపోతారు.. ఎవ్వరూ ఊహించరు.. అంచనాలుకు అందరంటూ నాగార్జున రెండింటి గురించి వివరించాడు. ఇక ఇంట్లో ఒక్కొక్కరుగా వచ్చి ఎవరికి ఏది సూట్ అవుతుందో చెప్పుకొచ్చారు.
ఇంట్లో మెజార్టీ సభ్యులు చిచ్చుబుడ్డి అంటే సోహెల్ అని చెప్పారు. ఒక్కసారిగా కోపం వస్తుంది.. మళ్లీ వెంటనే తగ్గిపోతుందని కారణాలు చెప్పారు. అయితే హారిక మాత్రం ఇంకాస్త ముందుకు వెళ్లి సోహెల్ పరువుదీసింది. ఏదో చేద్దామనుకుంటాడు.. మాటిమాటికి మీదకు వస్తాడు.. గొడవలు పెట్టుకుందాం రా అని అందర్నీ పిలుస్తాడు.. కానీ అతడ్ని ఎవ్వరూ పట్టించుకోరు.. దేఖరు అని చెప్పింది. హారిక అన్న మాటతో సోహెల్ తెగ ఫీలయ్యాడు. అలా ఎలా అంటుందని హారికపై సోహెల్ ఫైర్ అయ్యాడు.