మోనాల్ గురించి అలా అడిగిన నెటిజన్.. షాకైన సోహెల్

Bigg Boss 4 Telugu Sohel Shocked For netizen question

బిగ్ బాస్ కంటెస్టెంట్లందరి విషయం ఏమో గానీ.. టాప్ 3లో ఉన్న కంటెస్టెంట్లు మాత్రం ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నారు. అందులోనూ అభిజిత్, సోహెల్‌లు హీరోలయ్యారు. ఒకరు కప్ గెలిచి హీరో అయితే.. డబ్బులు తీసుకుని గేమ్ యూటర్న్ తిప్పిన సోహెల్ మరో హీరో అయ్యాడు. మధ్యలో అఖిల్ నిజంగానే కరివేపాకు అయ్యాడు. అలా అభిజిత్, సోహెల్ మాత్రం ఇప్పుడు ఇంటర్వ్యూలంటూ ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు. అంతే కాకుండా ఫ్యాన్స్ కోసం స్పెషల్‌గా ప్లాన్స్ చేస్తున్నారు.

Bigg Boss 4 Telugu Sohel Shocked For netizen question
Bigg Boss 4 Telugu Sohel Shocked For netizen question

ఈ వారం మొత్తం కూడా తనకు సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికి థ్యాంక్స్ చెప్పే ప్రోగ్రాంను పెట్టుకున్నానని అభిజిత్ చెప్పాడు. తన అభిమానులను కలుసుకోవాలని సోహెల్ తాజాగా లైవ్‌లోకి వచ్చాడు. అందులో సోహెల్‌ను రకరకాల ప్రశ్నలు అడిగారు. కథ వేరే ఉంటది డైలాగ్ చెప్పమని కోరారు.. చికెన్ మటన్ డ్యాన్స్ చేయమని రిక్వెస్ట్ చేశారు. ఇక ఫ్యాన్స్ అలా అడుగుతుండటంతో.. సోహెల్ డైలాగ్‌ చెప్పి, డ్యాన్స్ చేశాడు. ఆ స్కాం వీడియోపై వస్తోన్న నెగెటివ్ కామెంట్లపై సోహెల్‌కు సపోర్ట్‌గా ఎంతో మంది మద్దతుగా పలికారు.

ఇక కొందరు మాత్రం అరియానాను లైవ్‌లోకి తీసుకురమ్మని అడిగారు. ఇంకొందరు మోనాల్‌ను తీసుకురా అని అడిగారు. అలా ఒక్కొక్కరు ఒక్కో రకంగా అడుగుతూ ఉంటే ఓ నెటిజన్ మాత్రం దిమ్మతిరిగే పోయేలా కామెంట్ చేశాడు. అన్నా మోనాల్ నంబర్ ఉంటే ఇవ్వండి అన్నా అని అడిగడంతో సోహెల్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. హా. మోనాల్ నంబరా? అంటూ సెటైర్ వేశాడు. ఇంకా నాకే తెలియదు మోనాల్ నంబర్ అంటూ కౌంటర్ వేశాడు.