బిగ్ బాస్ షోలో లాస్య వ్యవహారం ఏంటో అర్థమే కాదు. ఆ నవ్వు ఫేకా? కన్నింగా? అని ఇంత వరకు ఎవ్వరూ కూడా కనిపెట్టలేకపోయారు. అది స్వచ్చమైన, నిజమైన నవ్వు అని మాత్రం ఎవ్వరూ ఒప్పుకోవడం లేదు. చివరకు సుమ కూడా అలాంటి ఓ కౌంటర్ వేసింది. లాస్యది కన్నింగ్ కాదు.. ఫేక్ కాదు… కొత్తది.. కవరింగ్ స్మైల్ అని కౌంటర్ వేసింది. సుమ అలా అనడంతో లాస్య మొహం కూడా మాడిపోయింది. కళ్లలో హావభావాలు మారిపోయాయి. మీరు కూడా ఏంటి? అని లాస్య అనడంతో.. ఆమెను కూల్ చేసేందుకు సుమ కాస్త బిస్కెట్ వేసింది.
అదే సంద్భరంలో ఓ విషయం ప్రస్థావనకు వచ్చింది. అవినాష్ విషయాన్ని లేవనెత్తుతూ.. ఓ అందమైన అమ్మాయికి బిస్కెట్లు వేస్తూనే ఉన్నాడు అని సుమ చెప్పుకొచ్చింది. ఆ అమ్మాయి ఎవరు అని అవినాష్‌ను అడిగితే ఏమో అక్క అని అనేశాడు. హారికనా? మోనాలా? అంటూ ఇలా ఒక్కొక్కరినీ అడుగుతూ వచ్చింది సుమ. లాస్య దగ్గరకు వచ్చే సరికి నేను అమ్మాయిని కాదు ఆంటీని అని తప్పించుకుంది. ఇలా తనను తాను ఆంటీ అని చెప్పుకోవడంతో అందరూ నవ్వేశారు.
లాస్యను ఆంటీ అని సోహెల్ సంబోధించడంతో చిన్నపాటి సరదా గొడవ అయింది. లాస్యను ఆంటీ అని పదే పదే సోహెల్ పిలుస్తుండటంతో బాగా ఫీలైంది. అలా పిలవొద్దని సూచించింది. నువ్వే చెప్పావ్ కదా ఆంటీ అని సోహెల్ అంటే.. నాకు నేను అనుకుంటాను.. కానీ మీరు అనొద్దని తెలిపింది. ఇంకోసారి నన్ను ఆంటీ అంటే నీకు యాంటీ అయిపోతా అని లోపల ఉన్న కోపాన్ని అంతా బయటకు స్వీట్‌గా తీసింది. ఆంటీ అంటే ఎంత ఉలుకెందుకో. లాస్య ఆంటీ కాకపోతే అమ్మాయా? అని నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు.