బిగ్ బాస్ మూడో సీజన్ విజేత రాహుల్ సిప్లిగంజ్ మాటతీరు ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. పక్కా మాస్, తెలంగాణ యాసలో దుమ్ములేపుతుంటాడు. కాస్త టెంపర్ కూడా ఎక్కువే. అలాంటి రాహుల్ రెండ్రోజుల క్రితం పెట్టిన పోస్ట్ సెన్సేషనల్ అయింది. అందులో తాను సోహెల్, అరియానాలకు సపోర్ట్ చేస్తున్నానని తెలిపాడు. ముందు అభిజిత్‌కు సపోర్ట్ అని చెప్పిన రాహుల్.. ఆ తరువాత సోహెల్, అరియానాలకు మద్దతు ప్రకటించడం తప్పేమీ కాదు.
కానీ ఆ పోస్ట్‌లో రాహుల్ అనకూడని మాటలు కూడా అన్నాడు. తాను జెన్యూనిటీ, పర్ఫామర్మర్స్‌కు మాత్రమే సపోర్ట్ చేస్తానని చెబుతూ.. పనికి మాలినోళ్లను తోసేయండంటూ చెప్పుకొచ్చాడు. అంటే రాహుల్ దృష్టిలో మిగతా వాళ్లందరూ పనికి రాని వాళ్లేనని అందరూ కామెంట్లుచేశారు. అందులో అభిజిత్ ఫ్యాన్స్ మాత్రం రాహుల్‌ను దారుణంగా ట్రోల్ చేశారు. ఆ ట్రోలింగ్‌కు రాహుల్ తన దైన శైలిలో సమాధానం ఇచ్చాడు. రాహుల్ వీడియోను షేర్ చేశాడు.
అలా ట్రోల్ చేస్తున్న వారిని హెచ్చరిస్తూ అరె హౌలేగాళ్లారా.. నేను ఏమైనా ఒక్కరికే సపోర్ట్ చేస్తానని అగ్రిమెంట్ రాసుకున్నానా?.. నాకు ఇష్టమొచ్చిన వారికి చేస్తాను.. బిగ్ బాస్ షో అంటే రోజుకు రోజుకూ మారుతూ ఉంటాయి.. వారం వారం గ్రాఫ్స్ మారుతూ ఉంటాయి.. కొందరు ఎలాగూ సేవ్ అవుతారని నాకు తెలుసు.. టాప్ 5లో ది బెస్ట్ కంటెస్టెంట్స్ ఉండాలనే ఉద్దేశ్యంతో అలా చెప్పాను.. అతనికి ఓట్లు ఎలా పడుతున్నాయ్.. ఏ రేంజ్‌లో పడుతున్నాయో తెలుసు.. వీరిని కూడా కాపాడుదామనే ఉద్దేశ్యంలోనే పోస్ట్ పెట్టాను అంటూ ట్రోలర్స్‌కు గట్టిగా సమాధానం ఇచ్చాడు.