బిగ్ బాస్ తనది తాను పెద్ద మేధావి అయినట్టు ఫీలవుతున్నారు. జనాలు బురిడీ కొట్టిద్దామని శతవిధాల ప్రయత్నిస్తున్నాడు. ప్రోమోలతో గారడీ చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో నిన్నటి సండే ఎపిసోడ్‌లో బిగ్ బాస్ టీం తమ పైత్యాన్ని చూపించింది. సుమ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటూ ఓ ప్రోమోను వదిలారు. అదంతా పబ్లిసిటీ స్టంట్ అని నెటిజన్లు ఇట్టే కనిపెట్టేశారు. కానీ కొంతమంది అమాయకపు చక్రవర్తులు మాత్రం నమ్మేశారు. కొంత మంది మీడియా వాళ్లు కూడా అది నిజమని భ్రమపడ్డారు. ఇంకొంత మందైతే ఏకంగా.. రెమ్యూనరేషన్ గురించి కూడా మాట్లాడేశారు.
లక్షలు కుమ్మరించి బిగ్ బాస్ షోకు తీసుకొస్తున్నారని వార్తలు రాసుకొచ్చారు. అసలు వైల్డ్ కార్డ్ ఎంట్రీని ప్రవేశ పెట్టే స్వరూపమే అది కాదు. అదంతా హడావిడే అని ఇట్టే కటిపెట్టేశారు మెజార్టీ జనాలు. సుమ ఏంటి? బిగ్ బాస్ షోలోకి రావడమేంటి? అది కూడా షో సగం అయిపోయాక రావడమేంటి? అసలు ఈ ప్రశ్నలకు ఉత్పన్నం కావడం కూడా వ్యర్థమే. సుమ రేంజ్ ఎక్కడో ఉంది.. బిగ్ బాస్ షో రేంజ్ ఆమెకు దరిదాపుల్లోనూ లేదు. వీలైతే సుమ కంటెస్టెంట్‌గా కాదు.. హోస్ట్ రేంజ్‌కు సరిపోతుంది. ఆ విషయం నిన్నటి ఓ పది నిమిషాల్లోనే తెలిసిపోయింది.
ఒక్కో కంటెస్టెంట్‌ను ఎలా ఆడుకుంది. ఎలా ఇమిటేట్ చేసింది.. అందరం చూశాం. ఒక వేళ ఆమె గనుక బిగ్ బాస్ హోస్ట్ అయితే వీకెండ్ షోలు దద్దరిల్లిపోతుంది. అసలే తన యాంకరింగ్ పోస్ట్‌కు ఎక్కడ ముప్పు వస్తుందో అని సుమ నాగార్జున మీద సెటైర్లు వేసింది. మీ కోడలు కూడా యాంకరింగ్ చేస్తోంది.. ఇక మాకు స్థానం ఉంటుందా? అని ఫన్నీ కామెంట్లు చేసింది. మొత్తానికి బిగ్ బాస్ టీం మాత్రం.. జనాలను బక్రాలను చేద్దామని ప్రయత్నించింది. కానీ సుమ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది పబ్లిసిటీ స్టంట్ అని మెజార్టీ నెటిజన్లు కనిపెట్టేశారు. బిగ్ బాస్ ప్లాన్‌ను తిప్పి కొట్టారు.