Bigg Boss 4 Telugu : ఓరి దేవుడో.. బిగ్‌బాస్ నాల్గో సీజన్ TRP చూస్తే షాక్ అవ్వాల్సిందే!!

Bigg Boss 4 Telugu Opening Ceremony Got 18.5 TRP

బిగ్‌బాస్ తెలుగు నాల్గో సీజన్ టీఆర్పీ లెక్కలు బయటకు వచ్చాయి. ఈ నాల్గో సీజన్ గత మూడు సీజన్ల రికార్డులను బద్దలు కొట్టేసింది. వాటన్నంటికి అందనంత ఎత్తులో నాల్గో సీజన్ నిలిచి ఉంది. తాజాగా బయటకు వచ్చిన ఈ రికార్డులు బిగ్ బాస్ షోకు ఉన్న క్రేజ్ పాపులారిటీకి నిదర్శనంగా మారాయి. అయితే ఈ షో మొదటి రోజు ఇంతలా హిట్ అవ్వడానికి చాలా కారణాలే ఉన్నాయి.

Bigg Boss 4 Telugu Opening Ceremony Got 18.5 TRP
Bigg Boss 4 Telugu Opening Ceremony Got 18.5 TRP

నాల్గో సీజన్ ప్రారంభం వేడుకలకు 18.5 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. అయితే మొదటి రోజు ఈ రేటింగ్ రావడం ఓ రికార్డ్. గత మూడు సీజన్లు ఇంతటి రేటింగ్‌ను రాబట్ట లేకపోయాయి. మొదటి సీజన్‌కు 16.18, రెండో సీజన్‌కు 15.05, మూడో సీజన్‌కు 17.9 వచ్చాయి. ఇక ఈ నాల్గో సీజనే అన్నింటి కంటే ముందంజలో ఉంది. దీనికి పలు కారణలు కూడా ఉన్నాయి.

కరోనా సమయం అందరూ టీవీలకే అతుక్కుపోవడం లాక్ డౌన్ వంటివి అన్ని కూడా ఈ షోపై హైప్‌ను తీసుకొచ్చాయి. కంటెస్టెంట్లు ఎలా ఉన్నా సరే షోకు మాత్రం ఆదరణ తగ్గడం లేదు. అందుకే ఈ నాల్గో సీజన్ ఇంతలా దూసుకుపోతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. మొదటి వారం టీఆర్పీ కూడా ఓ రికార్డే. మొదటి వారం ఈ షోకు 7.22 టీఆర్పీ వచ్చింది. ఇది రెండు, మూడు సీజన్ల కంటే ఎక్కువే. మొత్తానికి నాల్గో సీజన్ ఓ రేంజ్‌‌లో దూసుకుపోతోందని చెప్పడానికి ఈ టీఆర్పీలే నిదర్శనం.