ఎక్స్‌ట్రాలు చేసిన అరియానా.. అదిరిపోయే పంచ్ ఇచ్చిన నోయల్

Bigg Boss 4 Telugu Noel Punch To Ariyana

సీక్రెట్ రూం అంటూ సోహెల్, అరియానాలను మంచిగా మేపుతున్నాడు బిగ్‌బాస్. చేయడానికి ఏం పనిలేదు.. తినడం, ముచ్చట్లు పెట్టుకోవడం, టైంకు ఫుడ్ వస్తుంది తిని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. బిగ్‌బాస్ అని చెప్పి సుజాత, కరాటే కళ్యాణిలను వణికించాడు సోహెల్. వారు కూడా నిజమే అనుకుని తెగ కంగారుపడిపోయారు. ఇక మరి ప్రతీ రోజూ అలా సాగదు కదా. నేటి ఎపిసోడ్‌లో ఆ ఇద్దరికి బాగానే పంచ్ పడేట్టు కనిపిస్తోంది.

Bigg Boss 4 Telugu Noel Punch To Ariyana
Bigg Boss 4 Telugu Noel Punch To Ariyana

మొదటి రోజు సోహెల్ ఫోన్ ఫుడ్ ఆర్డర్ ఇచ్చాడు. మొదటి రోజు కాబట్టి ఇంటి సభ్యులెవరికీ కాన్సెప్ట్ అర్థం కాక భయపడి అడిగినన్ని వెరైటీస్‌తో ఫుడ్ పంపించారు. కానీ నేడు వారికి పస్తులేనేమో. నేడు అరియానా ఫోన్ చేసిన ఫుడ్ ఆర్డర్ ఇచ్చేందుకు ప్రయత్నం చేసినట్టుంది. మొదటగా ఫోన్ లిఫ్ట్ చేసిన అఖిల్.. ఆమెతో పులిహోర కలిపేందుకు ప్రయత్నించాడు. హలో ఎవరండి అని అడిగితే.. మేము మీ పక్కింట్లో ఉంటామని స్వీట్‌గా సమాధానం ఇచ్చింది అరియానా.

మీరు ఇలా మాట్లాడుతూ ఉంటే ఇంకా ఎక్స్‌ట్రా ఫుడ్ కూడా పంపిస్తానని అఖిల్ సర్తాక్ సమాధానమిస్తాడు. ఇది కొద్దిగా సీరియస్‌గా వినండి.. ఎందుకంటే మీ హౌస్‌మేట్స్‌తో ముడిపడి ఉంటుంది..అంటూ ఆరియానా ఏదో చెప్పబోతోండగా.. ఫోన్ లాక్కున్న నోయల్ ఏంది నీ ప్రాబ్లం అంటూ బెదిరించాడు. మర్యాదగా అడిగితే మర్యాదగా పంపిస్తాం అని నోయల్ బెదిరించడంతో.. యా ష్యూర్ అండి మీ పేరు అంటూ వయ్యారాలు ఒలకబోస్తూ అడిగింది. నా పేరు గూగుల్‌లో వెతుక్కపో అర్థమైందా బాయ్ అంటూ నోయల్ పంచ్ వేయడంతో అరియానా ఖంగుతింది.