బిగ్ బాస్ నాల్గో సీజన్‌పై రాహుల్ సిప్లిగంజ్ మొదటి నుంచి ఆసక్తిని చూపుతూనే ఉన్నాడు. మూడో సీజన్ విజేత అయిన రాహుల్ సిప్లిగంజ్.. నోయల్‌ను నాల్గో సీజన్‌కు పంపించాడు. మొదటి నుంచి బాగానే సపోర్ట్ చేశాడు. అయితే నోయల్ అనారోగ్యం కారణంగా బయటకు వచ్చే వరకు రాహుల్ తన మద్దతును తెలుపుతూనే వచ్చాడు. నోయల్ బయటకు వచ్చాక తన సపోర్ట్‌ను అభిజిత్, హారికలకు ఇచ్చాడు. ఎందుకంటే నోయల్‌కు ఇంట్లో ఇష్టమైంది ఆ ఇద్దరే కాబట్టి.
అక్కడి వరకు అంతా బాగానే ఉంది. అభిజిత్‌కు ఇకపై తన మద్దతు ఉంటుందని చెప్పిన రాహుల్ నిన్న యూటర్న్ తీసుకున్నాడు. తన దృష్టిలో టాప్ 2లో అరియానా, సోహెల్ ఉంటారని, తన సపోర్ట్ ఎప్పుడూ కూడా ఎంటర్టైనర్, జెన్యూనిటీకే ఉంటుందని తెలిపాడు. నేను వాళ్లిద్దరు టాప్ 2లో చూడాలని అనుకుంటున్నాను.ఎవ్వడు చెప్పినా నమ్మకండి.. పర్ఫామెన్జ్, జెన్యూనిటీకే సపోర్ట్ చేయండని తెలిపాడు.
దమ్ముంటే సపోర్ట్ జెన్యూనిటీ.. పనికిమాలినోళ్లను బయటకు తోసేయండని అన్నాడు. అయితే నోయల్‌తో ఏదో గొడవలు జరిగాయని అందుకే ఇలా మాట్లాడుతున్నాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. నోయల్ బర్త్ డే సందర్భంగా రాహుల్ విష్ కూడా చేయలేదని, నోయల్‌ను రాహుల్ తన సోషల్ మీడియా ఖాతాల్లో అన్ ఫ్రెండ్ కూడా చేసేశాడని నెటిజన్లు చెబుతున్నారు. మొత్తానికి ఈ ఇద్దరి మధ్య ఏదో జరిగిందని, అందుకే ఇలాంటి పోస్ట్‌లు పెడుతూ రాహుల్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడని అంటున్నారు.